BigTV English

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇది థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా, నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక కిక్‌ బాక్సింగ్ యువకుడు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రమాదంలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో అసలు స్టోరీ మొదలవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి, ఈ సినిమా బెస్ట్ సజెషన్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘రాంబో’ (Rambo) 2025లో వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి ముత్తయ్య దర్శకత్వం వహించారు. ఇందులో అరుల్‌నిథి, తన్య రవిచంద్రన్, అభిరామి, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 10,న Sun NXT ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది. IMDbలో 7.2/10 రేటింగ్ తో నడుస్తోంది.

కథలోకి వెళ్తే

రాంబో ఒక అనాధ. చిన్నప్పటి నుండి అనాధ ఆశ్రమంలో పెరిగాడు. ఇప్పుడు అదే ఆశ్రమాన్ని నడుపుతుంటాడు. అతను ఒక కిక్‌బాక్సర్ కూడా. స్ట్రీట్ ఫైటర్‌గా కొన్ని ఈ వెంట్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ పిల్లల కోసం తన వంతు కష్టపడతాడు. కానీ వాళ్ళకు సహాయం చేయడానికి అతని ఆర్థిక పరిస్థితి అంతగా సరిపోదు. ఇక కథలో మరో వైపు ఒక కాలేజ్ క్యాంపస్‌లో మిస్టీరియస్ సూసైడ్ జరుగుతుంది. మాలర్ అనే అమ్మాయి ఈ సూసైడ్ వెనుక నిజం తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఆమె చనిపోయిన అమ్మాయికి దగ్గర మనిషి. మాలర్ ఈ ఇన్సిడెంట్ వెనుక గౌతం అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటుంది.


Read Also : ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిల ప్రేమ… మిస్ అవ్వకుండా చూడాల్సిన పల్లెటూరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ

గౌతం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక నీచుడు. అతను ఇప్పుడు మాలర్‌ను కూడా చంపాలని అనుకుంటాడు. ఈ సమయంలో రాంబో ఆమెకు పరిచయం అవుతాడు. రాంబో మాలర్‌ కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. రాంబో తన కిక్‌బాక్సింగ్ స్కిల్స్ యూజ్ చేసి, గౌతం గ్యాంగ్‌తో ఫైట్ చేస్తాడు. ఇక వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలా ఉంటే గౌతం, రాంబో రన్ చేస్తున్న ఆశ్రమాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. దానికి రావాల్సిన ఫండ్స్ కూడా రాకుండా చేస్తాడు. దీంతో కథ డార్క్ సైడ్ ఎంట్రీ తీసుకుంటుంది. రాంబో దీనికి రివేంజ్ ప్లాన్ వేస్తాడు. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ తో అదరగొడుతుంది. రాంబో రివేంజ్ ఎలా ఉంటుంది ? అనాధ ఆశ్రమం కష్టాలు తీరుతాయా ? రాంబో ప్రేమకథ ఎంతవరకు వెళ్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

OTT Movie : లాటరీ డబ్బుతో అమ్మాయిలతో జల్సా… నరాలు జివ్వుమనే సీన్స్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie: భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా

OTT Movie : కుప్పలు తెప్పలుగా మనుషుల శవాలు … థ్రిల్లింగ్ సీన్స్… బోన్ చిల్లింగ్ కన్నడ సై-ఫై థ్రిల్లర్

OTT Movie : పాడు పనులు చేసే తేడాగాళ్లే ఈ అమ్మాయి టార్గెట్… ఆమెను అనుభవించాలనుకుంటే పార్ట్స్ ప్యాకయ్యే షాక్

OTT Movie : దొంగతనానికి వెళ్లి ట్రాప్ లో… ముసలాడా మజాకా… అదిరిపోయే మలయాళ కామెడీ థ్రిల్లర్

OTT Movie : ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిల ప్రేమ… మిస్ అవ్వకుండా చూడాల్సిన పల్లెటూరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Big Stories

×