OTT Movie : ‘వికటకవి’ వెబ్ సిరీస్ నటుడు నరేష్ అగస్త్య, మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ అనే సినిమాతో రొమాంటిక్ హీరో అవతారం ఎత్తాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై, నెల రోజుల్లోనే ఓటీటీలో కూడా అడుగు పెట్టింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా, ఈ సినిమా ఆడియన్స్ ని అలరించింది. ఇందులో హీరో మ్యూజిక్ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకుంటాడు. తండ్రిని ఎదిరించి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. ఇక హీరో ఇక్కడ ప్రేమలో కూడా పడతాడు. అయితే అన్నిటికీ అడ్డుతగిలే తండ్రిని ఎలా ఒప్పిస్తాడానేదే ఈ కథ. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ (Meghalu Cheppina Prema Katha) 2025లో వచ్చిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. విపిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధికా శరత్‌కుమార్, సుమన్, తులసి, విద్యుల్లేఖా, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 22న థియేటర్లలో విడుదలై, IMDb 7.8/10 రేటింగ్ పొందింది. సెప్టెంబర్ 26 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది.
వరుణ్ తండ్రి అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతను వరుణ్‌ను తన బిజినెస్ సామ్రాజ్యంలో కింగ్ మేకర్ ని చేయాలనుకుంటాడు. అయితే వరుణ్ కి తండ్రి వ్యాపారాల్లో తల దూర్చడం ఇష్టం ఉండదు. అతనికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అతను తన మ్యూజిక్ తో ప్రపంచాన్ని చుట్టాలనుకుంటాడు. దీంతో తండ్రి మీద గోడవపడి వరుణ్ ఇండియాకు వస్తాడు. ఇక్కడ తమిళనాడులో ఉండే తన నానమ్మ ఇంటికి వచ్చి, మేఘనా అనే అమ్మాయిని కలుస్తాడు. మేఘనా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఇక వరుణ్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ, మేఘనాతో ప్రేమలో పడతాడు. అయితే వీళ్ళ ప్రేమలో మరొక వ్యక్తి కూడా ఎంట్రీ ఇస్తాడు.
Read Also : ఓనర్ తో పనోడి రాసలీలలు… ఈ సినిమా గంటలు కాదు నిమిషాలే… సింగిల్స్ డోంట్ మిస్
మేఘనను మరో వ్యక్తి కూడా ప్రేమిస్తుంటాడు. వరుణ్ మాత్రం తన ప్రేమను వదులుకోకుండా, తన మ్యూజిక్ టాలెంట్‌ను బయట పెట్టడానికి ట్రై చేస్తాడు. ఈ విషయంలో మేఘనా అతనికి అండగా ఉంటుంది. అయితే ఇదంతా తెలుసుకున్న వరుణ్ తండ్రి, మేఘనా ఫ్యామిలీతో గొడవ పడతాడు. ఆ తరువాత కథ ఎమోషనల్ టచ్ తీసుకుంటుంది. ముఖ్యంగా వరుణ్ మ్యూజిక్, ప్రేమ , తండ్రి మధ్య నలిగిపోతాడు. చివరికి వరుణ్ మ్యూజిక్ రంగంలో తన టాలెంట్ నిరూపించుకుంటాడా ? తన ప్రేమను పొందుతాడా ? తండ్రితో సమస్యలు సమసిపోతాయా ? మేఘన ఎవరిని ప్రేమిస్తుంది ? ఈ స్టోరీకి శుభం కార్డ్ పడుతుందా ? అనే విషయాలను, ఈ తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాను చూసి తెలుసుకోండి.