Peddi Song Leak : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ లైఫ్ లో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. ప్రస్తుతం పెద్ది మూవీలో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఆ సాంగ్ లీకైంది. సాంగ్ షూటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది.. భారీ బడ్జెట్ తో పాటుగా డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీలోని సాంగ్ షూటింగ్ కు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది.. ఆ వీడియోలో రామ్ చరణ్ ఒక చెట్టు పై రాయి పై నిల్చొని డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎత్తయిన కొండలు, జలపాతం, పచ్చని ప్రకృతి.. లొకేషన్ చాలా అందంగా ఉంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రామ్ చరణ్ స్టెప్పులు వేస్తున్నాడు. చూస్తుంటే సోలో సాంగ్ లాగా కనిపిస్తుంది. లొకేషన్, అదిరిపోయే స్టెప్పులు.. సాంగ్ మూవీలో హైలెట్ అవుతుందని వీడియో చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘మొగలిరేకులు’ దేవి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.. ఆట కూలీగా ఉన్న చరణ్ అవసరమైన టైంలో ఆటగాడిగా ఎలా అదరగొడతాడు అన్నది పెద్ది కథ అని తెలుస్తుంది.. ఇప్పటికీ మూవీ నుంచి వచ్చిన టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ లుక్ గతంలో ఎన్నడు లేని విధంగా కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. అనుకున్న డేట్ కి తీసుకొచ్చేలానే చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు.. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఈ కాంబినేషన్లో ఆల్రెడీ రంగస్థలం సినిమా వచ్చింది. మాస్ లుక్ లో రామ్ చరణ్ అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమా రాబోతున్నడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.