BigTV English

OTT Movie : మనిషి మాంసాన్ని పీక్కుతినాలనే ఆకలి… ఈ అక్కాచెల్లెళ్ల అరాచకం చూస్తే గుండె గుభేల్… పోతారు మొత్తం పోతారు

OTT Movie : మనిషి మాంసాన్ని పీక్కుతినాలనే ఆకలి… ఈ అక్కాచెల్లెళ్ల అరాచకం చూస్తే గుండె గుభేల్… పోతారు మొత్తం పోతారు

OTT Movie : కన్నిబలిస్టిక్ సినిమాలలో సన్నివేశాలు భయంకరంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనిషి మాంసాన్ని మటన్ లా ఆరగిస్తుంటారు. ఈ సీన్స్ చూడటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో అక్కా చెల్లెళ్ళు ఇలాంటి పనులకు పాల్పడతారు. మనిషి మాంసాన్ని తింటూ స్టోరీని ముందుకు నడిపిస్తారు. అయితే అదేమిటో గాని ఈ సినిమా కంటెంట్ కు ప్రశంసలు కూడా వచ్చాయి. 2016 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో క్రిటిక్స్ వీక్ విభాగంలో ప్రీమియర్ అయిన ఈ చిత్రం FIPRESCI అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘రా’ (Raw) (ఫ్రెంచ్ లో Grave) జూలియా డుకోర్నావ్ దర్శకత్వంలో రూపొందిన కమింగ్-ఆఫ్-ఏజ్ బాడీ హారర్ చిత్రం. ఈ సినిమాలో గారాన్స్ మారిల్లియర్ (జస్టిన్), ఎల్లా రంప్ఫ్ (అలెక్సియా), రబాహ్ నైట్ ఓఫెల్లా (అడ్రియన్), లారెంట్ లూకాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2017 మార్చి 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కంటెంట్ వివాదాస్పదమైనప్పటికీ, డుకోర్నావ్ దర్శకత్వం, గారాన్స్ మారిల్లియర్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే

జస్టిన్16 ఏళ్ల చురుకైన యువతి. శాఖాహార కుటుంబంలో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు, సోదరి అలెక్సియా వెటరినరీ డాక్టర్లు. జస్టిన్ సెయింట్-ఎక్సుపరీ వెటరినరీ స్కూల్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అక్కడ ఆమె సోదరి అలెక్సియా ఇప్పటికే చదువుతోంది. సిగ్గుపడే మనస్తత్వం ఉన్న జస్టిన్ తన గే రూమ్‌మేట్ అడ్రియన్ ను కలుస్తుంది. ఈ సమయంలో కొత్త విద్యార్థుల కోసం వారంపాటు సాగే హేజింగ్ రిచ్యువల్‌లో పాల్గొంటుంది. ఇది దారుణమైన సంప్రదాయాలతో ఉంటుంది.ఈ హేజింగ్‌లో భాగంగా, కొత్త విద్యార్థులు జంతు రక్తాన్ని మీద పోసుకుంటారు. పచ్చి కుందేలు కిడ్నీ తినమని ఒత్తిడి చేస్తారు. శాఖాహారిగా ఉన్న జస్టిన్ మొదట వీటిని తిరస్కరిస్తుంది. కానీ అలెక్సియా ఒత్తిడి చేయడంతో ఆమె తినేస్తుంది. ఈ సంఘటన తర్వాత, జస్టిన్ శరీరమంతా దద్దుర్లతో బాధపడుతుంది. దీనిని డాక్టర్ ఫుడ్ పాయిజనింగ్‌గా నిర్ధారిస్తాడు. అయితే ఆమెలో ఒక విచిత్రమైన మార్పు ప్రారంభమవుతుంది. ఆమెకు మాంసం పట్ల తీవ్రమైన కోరిక కలుగుతుంది. ఆమె రహస్యంగా పచ్చి చికెన్ తింటుంది. ఇది ఆమెలో ఒక భయానక కన్నిబలిస్టిక్ స్వభావాన్ని సూచిస్తుంది.

జస్టిన్ కోరికలు క్రమంగా మానవ మాంసం వైపు మళ్లుతాయి. ఒక సంఘటనలో, అలెక్సియా జస్టిన్‌కు బికినీ వాక్సింగ్ చేస్తుండగా, పొరపాటున తన వేలిని కోస్తుంది. అలెక్సియా స్పృహ కోల్పోతుంది. జస్టిన్, తనను తాను నియంత్రించుకోలేక, కోసిన వేలిని తింటుంది. ఈ సంఘటన జస్టిన్ కన్నిబలిస్టిక్ కోరికలతో స్టోరీ ఒక మలుపు తిరుగుతుంది. ఆమె లైం*గిక కోరికలతో పాటు, ఈ కోరికలు కూడా మరింత తీవ్రమవుతాయి. జస్టిన్ తన కోరికలను తట్టుకోలేక బాయ్ ఫ్రెండ్ అడ్రియన్‌తో గడుపుతుంది. ఒక సన్నిహిత క్షణంలో ఆమె అతని భుజాన్ని కొరుకుతుంది. మరోవైపు ఆమె సోదరి అలెక్సియా కూడా కన్నిబలిస్టిక్ లక్షణాలను కలిగి ఉందని బయటపడుతుంది. ఇది సోదరీమణుల మధ్య హింసాత్మక సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

సినిమా ఒక విషాదకరమైన, షాకింగ్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఒక పార్టీలో అలెక్సియా ఒక రోడ్డు ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఆమె గాయపడిన వ్యక్తి మాంసాన్ని తింటుంది. జస్టిన్‌ను ఈ చర్యలో పాల్గొనమని ఒత్తిడి చేస్తుంది. అయితే జస్టిన్ తన కోరికలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అలెక్సియా, జస్టిన్ బాయ్ ఫ్రెండ్ అడ్రియన్‌ ని కూడా చంపేస్తుంది. ఒక హింసాత్మక ఘర్షణలో, అడ్రియన్ మరణిస్తాడు. ఇది తెలుసుకుని జస్టిన్, అలెక్సియాపై దాడి చేసి తీవ్రంగా గాయాపరుస్తుంది. చివరి సన్నివేశంలో, జస్టిన్ తన తండ్రితో మాట్లాడినప్పుడు, అతను ఆమె కన్నిబలిస్టిక్ స్వభావం ఇప్పుడు వచ్చింది కాదని, మన కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తోందని ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏమిటి ? జస్టిన్ కన్నిబలిస్టిక్ స్వభావంతోనే బతుకుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also: చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం

Related News

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

Big Stories

×