BigTV English

Vivo Vision Explorer: ఆపిల్ విజన్ ప్రోకు పోటీగా వివో విజన్ ఎక్స్‌ప్లోరర్.. 8K మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ లాంచ్

Vivo Vision Explorer: ఆపిల్ విజన్ ప్రోకు పోటీగా వివో విజన్ ఎక్స్‌ప్లోరర్.. 8K మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ లాంచ్

Vivo Vision Explorer| స్మార్ట్ డివైజ్ తయారీ కంపెనీ వివో.. చైనాలో తన మొదటి మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. దీని పేరు విజన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్. ఇది ఆపిల్ విజన్ ప్రోతో పోటీగా రూపొందించబడింది. ఈ హెడ్‌సెట్‌లో రెండు 8K మైక్రో-ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌ఆర్2+ జనరేషన్ 2 చిప్ లు ఉన్నాయి. వివో రూపొందించిన ఒరిజిన్‌ఓఎస్ విజన్ అనే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది నడుస్తుంది.


డిస్‌ప్లే, పనితీరు

విజన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో రెండు 8K మైక్రో-ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉన్నాయి, ఒక్కో డిస్‌ప్లే రిజల్యూషన్ 3,552 x 3,840 పిక్సెల్స్. ఇవి P3 కలర్ స్పేస్‌లో 94% కవరేజ్‌ను అందిస్తాయి, దీనివల్ల రంగులు నిజంగా లైఫ్ ఉన్నట్లు, స్పష్టంగా కనిపిస్తాయి. ఈ హెడ్‌సెట్ దృష్టి సరిదిద్దే సామర్థ్యం కలిగి ఉంటుంది, ఇది +100 నుండి -1000 వరకు సర్దుబాటు చేయగలదు. ఈ అధిక రిజల్యూషన్, రంగు కచ్చితత్వం వల్ల ఫొటోలు, వీడియోలు చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

ఈ హెడ్‌సెట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌ఆర్2+ జనరేషన్ 2 చిప్ ఉంది, ఇది వేగవంతమైన పనితీరు మరియు సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది. వివో రూపొందించిన బ్లూ ఓషన్ అనే పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బ్యాటరీ లైఫ్, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కేవలం 13 మిల్లీసెకన్ల అల్ట్రా-లో లేటెన్సీని అందిస్తుంది, దీనివల్ల యూజర్‌కి స్వల్పంగా ఆలస్యం లేని అనుభవం కలిగే అవకాశం ఉంది.


డిజైన్, సౌకర్యం

విజన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ బరువు కేవలం 398 గ్రాములు, ఎత్తు 83 మి.మీ, లోతు 40 మి.మీ. ఇది ఎక్కువ సేపు ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ముందు భాగంలో ఉన్న పెద్ద విజర్ విస్తృత ఫీల్డ్ వ్యూని అందిస్తుంది. వెనుక భాగంలో ఉన్న మెత్తని హెడ్‌బ్యాండ్ హెడ్‌సెట్‌ను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది.

టెక్నాలజీ విశేషాలు

ఈ హెడ్‌సెట్‌లో 1.5 డిగ్రీల కచ్చితత్వంతో కంటి ట్రాకింగ్ సామర్థ్యం ఉంది. ఇది 26 డిగ్రీల లోతు, 175 డిగ్రీల వర్టికల్ ఇంటరాక్షన్ స్పేస్‌లో సూక్ష్మంగా చేసే సైగలను సైతం గుర్తిస్తుంది. అదనపు కంట్రోలర్‌లు లేకుండానే సైగల ద్వారా హెడ్‌సెట్‌ను నియంత్రించవచ్చు. 180 డిగ్రీల ఫీల్డ్ వ్యూ, స్పేషియల్ ఆడియో కలిసి అత్యంత ఆకర్షణీయమైన అనుభవాన్ని అందిస్తాయి. 120 అంగుళాల వర్చువల్ సినిమా స్క్రీన్‌ను కూడా ఇందులో సృష్టించవచ్చు. అంతేకాదు దీన్ని చేతి సైగలతో కూడా కంట్రోల్ చేయవచ్చు.

ఇతర ఫీచర్లు

విజన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్.. 3D వీడియో రికార్డింగ్, స్పేషియల్ ఫోటో క్యూరేషన్ సామర్థ్యాలను కలిగి ఉంది. కొన్ని అడ్వాన్స్ ఫీచర్లు.. వివో ఎంపిక చేసిన మొబైల్ పరికరాలతో మాత్రమే పనిచేస్తాయి. మల్టీ-డివైస్ కాస్టింగ్, ఇమ్మర్సివ్ డోమ్ వీడియో ఎక్స్ పీరియన్స్, గేమింగ్, మల్టీ-విండో ప్రొడక్టివిటీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

లాంచ్, పోటీ

ప్రస్తుతం చైనాలోని 12 వివో కు చెందిన ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. త్వరలో మరిన్ని స్టోర్లు తెరవబడతాయి. ఈ హెడ్‌సెట్ ఆపిల్ విజన్ ప్రో, మెటా క్వెస్ట్ 3, రాబోయే సామ్‌సంగ్ ఎక్స్‌ఆర్ హెడ్‌సెట్‌లతో పోటీపడనుంది.

Also Read: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Related News

Redmi Note 15 Pro+: రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీ, 90W చార్జింగ్ లాంటి సూపర్ ఫీచర్లు

Dinosaur Eggs: అంగారక గ్రహంపై ‘డైనోసార్ ఎగ్స్’.. ఒకప్పుడు అక్కడ జీవులు మనగడ ఉండేదా?

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Big Stories

×