OTT Movie : హారర్ జానర్ లో వస్తున్నఇండోనేషియన్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మామూలుగానే ఈ సినిమాలు వణుకు పుట్టిస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా, రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. అంతేకాకుండా, అక్కడ రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దాని భయంకరమైన ఒక ఎమోషన్ కథనం కారణంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే కొంతమంది దాని హింసాత్మక కంటెంట్ ను విమర్శించారు. ఈ సినిమా 2016లో ఇండోనేషియాలోని సిరెబోన్‌లో జరిగిన నిజమైన హత్య ఘటన చుట్టూ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘వినా: బిఫోర్ 7′ డేస్’ (Vina: Before 7 Days) (ఒరిజినల్ టైటిల్: Vina: Sebelum 7 Hari) ఇది ఒక ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ చిత్రం. దీనికి అంగ్గా ద్విమాస్ సాస్మితో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నైలా డి. పుర్నమా వినా దేవీ, యూసుఫ్ మహర్దికా, లిడియా నికోలెట్టా, డెలియా రషీద్, ఫహద్ హయ్ద్రా వంటి నటీనటులు నటించారు. ఈ సినిమా 2016లో ఇండోనేషియాలోని సిరెబోన్‌లో జరిగిన వినా, ఎకీ హత్యల వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం ఇండోనేషియాలో 2024 మే 8న విడుదలై, నెట్‌ఫ్లిక్స్‌లో 2024 ఆగస్టు 15 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
వినా దేవీ అర్సితా, ఆమె ప్రియుడు ఎకీ ఒక రాత్రి మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా, ఒక మోటార్‌సైకిల్ గ్యాంగ్ వాళ్ళపై దారుణంగా దాడి చేస్తుంది. ఈ దాడిలో వినా అత్యంత దారుణంగా వేధింపులకు గురవుతుంది. ఆమెతో పాటు ఎకీ కూడా హత్యకు గురవుతాడు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఒక హత్య అని తర్వాత బయటపడుతుంది. ఈ సినిమా వినా ఆత్మ ద్వారా కథను చెబుతుంది. వినా మరణించిన తరువాత , ఆమె ఆత్మ తన స్నేహితురాలు లిండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తన హత్య వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది.
ఏడు రోజులలో, వినా ఆత్మ లిండా ద్వారా, తన కుటుంబం, పోలీసులకు హత్యల వివరాలను తెలియజేస్తుంది. దీనిలో మోటార్‌సైకిల్ గ్యాంగ్ దారుణ చర్యలు బయటకి వస్తాయి. ఈ గ్యాంగ్‌లోని క్రూరమైన చర్యలు, వీళ్ళు హత్యను దాచడానికి చేసిన ప్రయత్నాలు కథలో కీలక భాగం అవుతాయి. కథలో రెండు టైమ్‌లైన్‌లు ఉంటాయి. వినా, ఎకీ ప్రేమ కథ, హత్యకు దారితీసిన సంఘటనలు. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో లవ్ స్టోరీ, క్రూరమైన దాడి హైలైట్ అవుతాయి. ఈ సినిమా ఒక ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది.
Read Also : అమ్మాయితో అర్ధరాత్రి ఆ పాడు పని… సూపర్ స్టార్ పై మీటూ ఆరోపణలు… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్