E-Paper
Advertisement

కాలేజ్ బ్యాక్డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్… ఎట్టకేలకు ఓటీటీ ఎంట్రీకి సిద్ధం

కాలేజ్ బ్యాక్డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్… ఎట్టకేలకు ఓటీటీ ఎంట్రీకి సిద్ధం
Advertisement

Crime Thriller OTT : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల డిజిటల్ ఎంట్రీపై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా సినిమాలు నెలలోపే ఓటీటీలో అడుగు పెడుతున్నాయి. కానీ 8 వారాలకు మించిన విండో టైంకు డిజిటల్ స్ట్రీమింగ్ ను పెంచాలనేది ఎగ్జిబిటర్ల డిమాండ్. ఈ వివాదం ఇంకా నడుస్తుండగానే చాలా సినిమాలు ఇప్పటికీ నెలరోజులు తిరక్కుండానే థియేటర్లలో నుంచి ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రమే అందుకు వ్యతిరేకంగా థియేటర్లోకి వచ్చిన కొన్ని నెలల తర్వాతే డిజిటల్ డెబ్యూకి సిద్ధమవుతున్నాయి. నిజానికి ఇలా లేటుగా ఓటిటి ఎంట్రీకి నోచుకుంటున్న సినిమాలు ఏదో సూపర్ హిట్ మూవీస్ అయితే కాదు. తాజాగా అలాంటి సినిమాల లిస్టులో ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా చేరింది. ఈ వారమే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. మరి ఆ సినిమా పేరేంటి ? మూవీని ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

సింప్లీ సౌత్ ఓటిటిలో స్ట్రీమింగ్

క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన తమిళ మూవీ ‘రెడ్ లేబుల్’ (Red Label Tamil Movie 2026). ఇటీవల విడుదలైన ఈ మూవీ అక్కడ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్ దక్కించుకుంది. మూడు నెలల క్రితం థియేటర్లో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు అంటే ఈ వారమే డిజిటల్ డెబ్యూకి సిద్ధంగా ఉంది. లెనిన్, అజ్మీన్ యాసర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ఆర్వి ఉదయ్ కుమార్, మునిష్కాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కెఆర్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలో అడుగు పెట్టింది. ఇక మే 22 నుంచి ఈ సినిమా ఓటిటిలో అందుబాటులోకి రానుంది. సింప్లీ సౌత్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను ఆడియన్స్ వీక్షించవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ మర్డర్ మిస్టరీలో హీరో కాథీర్. సినిమా మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. నిజానికి అతను ఒక కాలేజ్ ఫార్మర్ చైర్మన్ గా ఉండేవాడు. కానీ కొన్ని కేసుల కారణంగా సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. అయితే ఈ క్రమంలోనే రోహిత్ అనే స్టూడెంట్ ఇతని దగ్గరికి వెళ్తాడు. ఎమ్మెల్యే కొడుకు పాండ్యన్ కాలేజీలో గూండా ఇజం చెలాయిస్తున్నాడని కంప్లైంట్ చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే పాండ్యన్ చెల్లెలు పవిత్రను కాథీర్ లవ్ చేస్తాడు.

Also Read : గర్భిణీలను మాత్రమే చంపుతున్న సైకో కిల్లర్… ఆరు నెలల తరువాత ఓటీటీలోకి… ట్రెండింగ్ లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

Advertisement

కాలేజ్ చైర్మన్ పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాథీర్ కు, పాండియన్కు మధ్య రగడ మొదలవుతుంది. ఎందుకంటే పాండియన్ కు వ్యతిరేకంగా కాథీర్ ఈ ఎన్నికల్లో నిలబడతాడు. అయితే స్టూడెంట్స్ తో పాటు లెక్చరర్లు కూడా కాథీర్ కే సపోర్ట్ చేయడంతో పాండ్యన్ రగిలిపోతాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై పగ తీర్చుకోవడానికి సొంత చెల్లెలిని వాడుకుంటాడు. ఆమెకు ఓ రౌడీని ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో కాథీర్ గొడవకు దిగడంతో రౌడీ మరణిస్తాడు. దీంతో అతనిపై మర్డర్ కేసు ఫైల్ అవుతుంది. మరి ఏం తప్పు చేయని కాథీర్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు ? స్టూడెంట్స్ అతనికి అండగా నిలిచారా లేదా ? చివరికి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా ? అన్నది తెలియాలంటే రెడ్ లేబుల్ మూవీని చూడాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×