E-Paper
Advertisement

Republic Day 2026 Movie : మనసును మెలిపెట్టే లేటెస్ట్ బెస్ట్ వార్ డ్రామాలు… రక్తాన్ని మరిగించే రివేంజ్ కూడా

Republic Day 2026 Movie : మనసును మెలిపెట్టే లేటెస్ట్ బెస్ట్ వార్ డ్రామాలు… రక్తాన్ని మరిగించే రివేంజ్ కూడా
Advertisement

Republic Day 2026 Movie : థియేటర్లలో విడుదలైన ‘బోర్డర్ 2’ ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సన్నీ డియోల్ మరోసారి తనదైన యాక్షన్ మోడ్ ని చూపించాడు. సైనికులు చేసే ప్రాణ త్యాగాలతో ఈ సినిమా దేశభక్తిని చాటుతోంది. ఇక ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అయితే అలాంటి దేశభక్తి సినిమాలను ఇప్పుడు ఓటీటీలో కూడా చూడచ్చు. రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని గొప్ప దేశభక్తి సినిమాలపై ఈ రోజు ఓ లుక్ వేద్దాం. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి పేర్లు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

బోర్డర్

ఇప్పటికే థియేటర్లలో ఘన విజయం సాధించింది సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ మూవీ. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో సైనికుల అసాధారణ ధైర్యం, త్యాగాలను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే మూడు దశాబ్ధాల క్రితం వచ్చిన వార్ డ్రామా ‘బోర్డర్’ కి సీక్వెల్ ఈ సినిమా. బోర్డర్ 2 విడుదలకు ముందే, ఇది ట్రెండింగ్ జాబితాలోకి ప్రవేశించింది. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.

కేసరి

Advertisement

అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’ సినిమా వార్ నేపథ్యంలో ఉంటుంది. 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది, అందుకే ప్రజలు ఇప్పటికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాను చూసి ఆనందిస్తుంటారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

అమరన్

ఇండియన్ ఆర్మీ మేజర్ ముఖుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా, లవ్, ఫ్యామిలీ, దేశ రక్షణ మధ్య బ్యాలెన్స్ చూపిస్తూ తన ప్రాణాలను అర్పించిన ఒక ధైర్యవంతుడి హార్ట్ టచింగ్ బయోపిక్ ఇది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ధురంధర్

Advertisement

దేశ భద్రత కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, స్పైలు, రహస్య మిషన్ల మధ్య రన్వీర్ సింగ్ ఇంటెన్స్ పోరాటం చూపించే గ్రిట్టీ స్పై-థ్రిల్లర్.ఈ సినిమా జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టనుంది.

ఫైటర్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఆకాశంలో దేశ రక్షణ కోసం చేసే అద్భుతమైన యాక్షన్ మూవీ ఇది. హృతిక్ రోషన్ లీడ్‌లో ఉత్కంఠగా సాగే ప్యాట్రియాటిక్ ఎయిర్‌ఫోర్స్ థ్రిల్లర్. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

120 బహదూర్

1962 ఇండియా-చైనా యుద్ధంలో రెజాంగ్ లా బ్యాటిల్‌లో 120 అహీర్ సైనికులు, మేజర్ శైతాన్ సింగ్ నాయకత్వంలో చూపిన అసాధారణ ధైర్యం, త్యాగాన్ని గౌరవిస్తూ ఫర్హాన్ అఖ్తర్ లీడ్‌లో వచ్చిన రియల్ హీరోల ట్రిబ్యూట్ వార్ ఫిల్మ్. ఈ చిత్రం 2026 జనవరి 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ లో ఉంది. ఈ సినిమాలన్నీ రిపబ్లిక్ డే సందర్భంగా దేశభక్తి రగిలేలా చేసే ఎమోషనల్ & ఇన్‌స్పైరింగ్ తో ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసి జై హింద్ అనాల్సిందే ఈ సినిమాలను చూసి.

Read Also : పోలీస్ స్టేషన్ లోనే మకాం పెట్టే సీరియల్ కిల్లర్… గ్రిప్పింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×