E-Paper
Advertisement

ఆసియాలో బంగ్లానే రెండో బెస్ట్ టీమ్…పాకిస్తాన్‌ ప‌రువు తీసిన బాసిత్ అలీ

ఆసియాలో బంగ్లానే రెండో బెస్ట్ టీమ్…పాకిస్తాన్‌ ప‌రువు తీసిన బాసిత్ అలీ
Advertisement

Basit Ali: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ప్రస్తుతం మండే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారిన నేపథ్యంలో DLS పద్ధతి ప్రకారం… రిజల్ట్ ప్రకటించారు. వర్షం పడే కంటే ముందే బంగ్లాదేశ్ విజయం దాదాపు ఖరారు అయింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ విజయం సాధించినట్లు ప్రకటించారు అంపైర్లు. అయితే వరల్డ్ లో అత్యంత భయంకరమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ ఓడించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఆస్ట్రేలియా పై 21 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇక బంగ్లాదేశ్ విక్టరీ పై పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ బాసిత్ అలీ (Basit Ali) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియా ఖండంలోనే టీమిండియా ( Team India) తర్వాత బంగ్లాదేశ్ నే ( Bangladesh) రెండో బెస్ట్ టీమ్ అంటూ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ముందు, పాకిస్తాన్ (Pakistan Team)  క్రికెట్ జ‌ట్టు దేనికి ప‌నికి రాదంటూ బాంబ్ పేల్చారు బాసిత్ అలీ. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

ఆసియాలో బంగ్లానే రెండో బెస్ట్ టీమ్…పాకిస్తాన్‌ ప‌రువు తీసిన బాసిత్ అలీ

Advertisement

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ మొదటి వన్డేలో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ ఢాకా వేదికగా జరగగా మొదట బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 50 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్, 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా, 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే సాధించింది. అప్పటికే వర్షం పడిన నేపథ్యంలో… డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ ను విజేతగా నిలిపారు.

అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాకిస్తాన్ జట్టుపై ఇటీవల టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్… అదే ఊపును కొనసాగిస్తుందని వ్యాఖ్యానించారు. తమీమ్ ఇక్బాల్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్ర మారిపోయిందని ప్రశంసించారు. ఆసియా ఖండంలో టీమిండియా మొదటి స్థానంలో ఉంటే… ఇప్పుడు రెండో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచిందని చెప్పవచ్చని వ్యాఖ్యానించారు. టెస్టులు అలాగే వన్డేల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. అయితే పాకిస్తాన్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారయిందని వ్యాఖ్యానించారు.

Advertisement

 

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×