E-Paper
Advertisement

OTT Movie : ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్ ను పంచుకునే సైకో… ముగ్గురూ కలిసి ఒకే అమ్మాయితో… ఆ పిల్ల రివేంజ్ చూస్తే గూస్ బంప్స్

OTT Movie : ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్ ను పంచుకునే సైకో… ముగ్గురూ కలిసి ఒకే అమ్మాయితో… ఆ పిల్ల రివేంజ్ చూస్తే గూస్ బంప్స్
Advertisement

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు ప్రేక్షకులు. ఎలాంటి కంటెంట్ కావాలన్నా ఒక్క క్లిక్ తో కళ్ల ముందు వాలిపోతున్నాయి. ఇక థియేటర్లలో విడుదలైన సినిమాలైతే, వారం పది రోజుల్లో ఓటీటీలో కి వచ్చేస్తున్నాయి. ఇక హాలీవుడ్ కంటెంట్ కి ఓటీటీలో కొదవే ఉండదు. ఈ సినిమాలలో కామన్ గా రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. అది యాక్షన్ అయినా, కామెడీ అయినా, థ్రిల్లర్ అయినా ఈ సీన్లని వదిలిపెట్టరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా యాక్షన్ సీన్స్ తో పాటు, హాట్ సీన్స్ కూడా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన ఒక అమ్మాయి, రివేంజ్ తీర్చుకునే క్రమంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘రెవెంజ్’ (Revenge) అనే సినిమా 2017లో విడుదలైన ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీన్ని కొరాలీ ఫార్జియట్ డైరెక్ట్ చేసింది. లీడ్ రోల్స్‌లో మాటిల్డా లూట్జ్ (జెన్), కెవిన్ జాన్సెన్స్ (రికార్డో), విన్సెంట్ కొలాంబ్ (స్టాన్), గియోమ్ బౌషెడ్ (డిమిట్రి) నటించారు. ఈ సినిమా 2017 సెప్టెంబర్ 8న టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2018 మార్చిలో USలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, షడ్డర్  లో అందుబాటులో ఉంది. 1 గంట 40 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, ఐయండిబిలో 6.4/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జెన్ అనే అందమైన అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ రికార్డోతో ఒక వెకేషన్‌కు వస్తుంది. రికార్డో బాగా రిచ్, ఇదివరకే పెళ్లైన వ్యక్తి. అయితే భార్యకి మస్కా కొట్టి ఇద్దరూ రొమాన్స్ ను ఎంజాయ్ చేయడానికి వస్తారు. స్విమ్మింగ్, డ్యాన్స్, కిస్సులతో వీళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అకస్మాత్తుగా రికార్డో దగ్గరకి స్టాన్, డిమిట్రి అనే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. వాళ్లు అక్కడికి హంటింగ్‌కు వచ్చామని చెబుతారు. మొదట అంతా సరదాగా ఉంటుంది. కానీ రికార్డో జెన్‌కు ఇది మన లాస్ట్ ట్రిప్, నా భార్య తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెబుతాడు. ఆ మాటకు జెన్ షాక్ అవుతుంది. బాగా ఏడుస్తుంది. మరుసటి రోజు రికార్డో హంటింగ్‌కు వెళ్తాడు. వీళ్ళు ఉన్న మాన్షన్ లో జెన్ ఒంటరిగా ఉంటుంది. ఇంతలో బయటి నుంచి వచ్చిన స్టాన్ ఆమెపై దాడి చేసి బలవంతం చేస్తాడు. డిమిట్రి చూస్తూ ఉండిపోతాడు. ఆ తరువాత అతను కూడా ఆమె మీద ప్రతాపం చూపిస్తాడు. ఇక ఏమీ తెలీనట్లు రికార్డో బయటి నుంచి ఆమె దగ్గరకి వస్తాడు. ఆమె ఏడుస్తూ మంచం మీద పడుకుని ఉంటుంది.

Read Also : ఇంటిముందు తిష్ట వేసే సైకో… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని కథ మావా

Advertisement

నిదానంగా ఆమెకు రికార్డో మీద కూడా అనుమానంవస్తుంది. ఇది అతని ప్లాన్ అని ఆమెకు అర్థం అవుతుంది. వాళ్లు ఆమెను పెద్ద క్లిఫ్ నుండి కిందకు తోసేస్తారు. చచ్చిపోయిందని అనుకుని వెళ్లిపోతారు. అయితే జెన్ ఆమె గాయాలతో కింద పడి ఉంటుంది. ఇక జెన్ రివేంజ్ ప్లాన్ చేస్తుంది. వాళ్ల హంటింగ్ స్పాట్‌కు వెళ్తుంది. వాళ్లు రిలాక్స్‌గా ఉంటారు. జెన్ ఒక గన్ తీసుకుని మొదట స్టాన్‌ను చంపుతుంది. ఈ షాకింగ్ ట్విస్ట్ తో రికార్డో, డిమిట్రి షాక్ అవుతారు. జెన్ “మీరు నన్ను చంపారని అనుకున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని చంపుతాను” అని కసిగా ఒక డైలాగ్ చెప్తుంది. డిమిట్రిని జెన్ కత్తితో పొడిచి చంపేస్తుంది. రికార్డో చాలా భయపడతాడు. నేను నిన్ను లవ్ చేశానని ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. చివరికి రికార్డో ని కూడా జెన్ చంపుతుందా ? ఆమె రివేంజ్ కంప్లీట్ అవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసితెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×