Atlee Allu Arjun : ప్రస్తుతం ప్రేక్షకులకు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూడటం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఒక సూపర్ హిట్ సినిమా ఏ లాంగ్వేజ్ లో ఉన్నా కూడా దానిని అతి త్వరగా చూస్తారు కేవలం చూడటం మాత్రమే కాకుండా ఆ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతుంటారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఇతర భాష సినిమాలను ఆదరిస్తారు కానీ తెలుగు సినిమాలను ఇతర భాష ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో ఆదరించరు ఈ విషయం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామందికి కూడా తెలుసు.
రాజా రాణి సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అట్లి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాను చూశారు అయితే అప్పటి నుంచే అట్లీ దర్శకుడుగా చేసిన సినిమాలను చూడటం మొదలుపెట్టారు అట్లీ దర్శకుడిగా చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలైంది అందుకే దర్శకుడు అట్లీ పైన తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. మొత్తానికి మొదటిసారి అట్లీ ఒక తెలుగు హీరోతో సినిమాను చేస్తున్నాడు.
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా సినిమా అని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అంటూ చాలామంది ప్రశంసలు కూడా ఇస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు ఇండియన్ సినిమా వర్గాల్లో టాపిక్స్ వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో దీపిక పదుకొనే నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ వీడియో కూడా విడుదల చేశారు. కేవలం దీపికా పదుకొనే మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. సీతారామం సినిమాతో విపరీతమైన గుర్తింపు సాధించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆవిడకి సంబంధించిన సీన్లు షూటింగ్ అవుతున్నట్టు సమాచారం వినిపిస్తుంది.
మృణాల్ ఠాకూర్ తో పాటు జాన్వి కపూర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఊహకు కూడా అందటం లేదు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే అట్లీ కెరియర్ లో దర్శకుడిగా 1000 కోట్లు సినిమా ఉంది. షారుక్ ఖాన్ హీరోగా చేసిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం. ఆ సినిమా తర్వాత అట్లీ డీల్ చేస్తున్న ప్రాజెక్టు కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇద్దరు సక్సెస్ఫుల్ పీపుల్ కలిసి ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. కాబట్టి హైపు మామూలుగా లేదు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. దాదాపు 800 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అనేది వినిపిస్తున్న టాక్.
Also Read: Prabhas Spirit: ఇకపై స్పిరిట్ సినిమా అప్డేట్స్ రావు, కారణం ఇదే?