OTT Movie : చాలా మంది షార్ట్ ఫిల్మ్ ల ద్వారా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. దీనికి సోషల్ మీడియా వేదికను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ వాళ్ళు చెప్పాల్సింది చూపిస్తున్నారు. అయితే వీటిలో హారర్ ఫిల్మ్స్ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. కేవలం కొన్ని నిమిషాలలోనే ఆడియన్స్ ని భయపెడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్, సూపర్ నాచురల్ హారర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది. ఈ కథ ఒక టీనేజ్ గర్ల్ బయట ఒక మిస్టీరియస్ ఫిగర్‌ని చూస్తుంది. ఆమె డాడ్ ఇచ్చే సింపుల్ అడ్వైస్ తో ఎఫెక్టివ్ గా ఈ కథ నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘డోంట్ లుక్ అవే’ (Don’t Look Away) అనే 2017లో విడుదలైన అమెరికన్ హారర్ షార్ట్ ఫిల్మ్. దీన్ని క్రిస్టోఫర్ కాక్స్ రాసి, డైరెక్ట్ చేశాడు. ఇది కేవలం 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్. కానీ చాలా షాకింగ్ సస్పెన్స్‌ఫుల్ స్టోరీ. YouTubeలో 50 మిలియన్ వ్యూస్ తో ఈ షార్ట్ ఫిల్మ్ దూసుకెళ్తోంది.
సవాన్నా అనే టీనేజ్ గర్ల్ ఇంట్లో ఒక్కటే ఉంటుంది. ఆమె బెడ్‌రూమ్ విండో నుండి బయట గార్డెన్‌లో ఒక మాస్క్ మ్యాన్ నిలబడి, ఆమెను సైలెంట్‌గా చూస్తున్నాడని గమనిస్తుంది. సవాన్నా భయపడి, తన డాడ్ కి ఫోన్ చేస్తుంది. అతను కూడా ఇది విని షాక్ అవుతాడు. అతను “డోంట్ లుక్ అవే” అని చెబుతాడు. ఆ మ్యాన్‌ని మరలా నువ్వు అలా చూడకు, నేను వెంటనే ఇంటికి వస్తాను అని చెప్తాడు. సవాన్నా టెన్షన్‌గా విండో వద్దే కూర్చుంటుంది. ఆ మ్యాన్ ఎందుకు వచ్చాడు, ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తుంది. సవాన్నా తన డాడ్ తో ఫోన్‌లో మాట్లాడుతూ, ఆ మ్యాన్‌ని చూస్తూనే ఉంటుంది. కానీ సవాన్నా తన బ్రదర్ కి కూడా కాల్ చేస్తుంది.
Read Also : పుట్టకముందే జరిగిన క్రైమ్స్ చెప్పే 2వ తరగతి పిల్లాడు… మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్
వాళ్లు ఇద్దరూ ఈ విషయం మీద భయంగా ఉంటారు. ఆ మ్యాన్ క్రమంగా దగ్గరకు వస్తాడు. అతని ఫేస్ మరింత క్రీపీగా కనిపిస్తుంది. మాస్క్ కింద ముఖం అస్పష్టంగా ఉంటుంది. ఇంట్లో లైట్స్ మసకగా ఉంటాయి. బయట చీకటి అవుతుంది. ప్రతి సెకెండ్ టెన్షన్ పెరుగుతుంది. చివరి మినిట్‌లో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. సవాన్నా ముందుకు ఆ మాస్క్ మ్యాన్ వస్తాడు. ఇంతలో ఆమె తండ్రి కూడా అక్కడికి వస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది ? ఆ మాస్క్ మ్యాన్ ఎవరు ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ హారర్ షార్ట్ ఫిల్మ్ ని చూసి తెలుసుకోండి.