E-Paper
Advertisement

Pennu Case OTT : నిత్య పెళ్ళికూతురు నిఖిలా విమల్ మలయాళ మూవీ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Pennu Case OTT : నిత్య పెళ్ళికూతురు నిఖిలా విమల్ మలయాళ మూవీ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Pennu Case OTT : ఈమధ్య నిత్య పెళ్లి కొడుకులు, నిత్య పెళ్లి కూతుర్లు ఎక్కువైపోయారు. అందిన కాటికి దోచుకుని మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక మలయాళం కామెడీ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. లేక లేక పెళ్లి చేసుకోబోతన్న అబ్బాయిలను ఒక అమ్మాయి టార్గెట్ చేస్తుంటుంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని మరింత జోష్ తో ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఫెబిన్ సిద్ధార్థ్ దర్శకత్వం హించిన ‘పెన్ను కేస్’ (Pennu Case) చిత్రంలో నిఖిలా విమన్ లీడ్ రోల్‌లో నటించగా, హకీం షాజహాన్, శివజీత్, అజు వర్గీస్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో ఉన్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో 2026 మార్చి 12 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రన్ ఇవ్వకపోయినా, కామెడీ సీన్స్ మాత్రం బాగా పండాయి ఇందులో. ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ మూవీ.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

రోహిణి (నిఖిలా విమల్) అనే ఒక యువతి కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుని, పెళ్లి పేరుతో మోసం చేస్తూ ఉంటుంది. ఆమె రకరకాల పేర్లతో, రకరకాల ఊళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లిళ్లు చేసుకుంటుంది. అయితే ఒక పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో కథ మలుపు తిరుగుతుంది. ఆమె చేతిలో గతంలో మోసపోయిన సుమారు పదిమంది అబ్బాయిలు ‘మెన్స్ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏకమై అక్కడికి చేరుకుంటారు. అందరూ కలిసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవవడానికి ప్రయత్నిస్తారు.

ఇక ఈ కేసును సీఐ మనోజ్ (హకీం షాజహాన్) కూడా విచారిస్తుంటాడు.  క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? అసలు రోహిణి ఈ మోసాలు ఎందుకు చేస్తోంది? ఆమె వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా? లేక ఆమెకు ఏదైనా బలమైన కారణం ఉందా? అనేది సినిమా విచారణలో బయటపడుతుంది.

Advertisement

Read Also :  అనుపమ పరమేశ్వరన్ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి… తెలుగులోనూ చూడచ్చు

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×