E-Paper
Advertisement

Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Advertisement

Ramchander Rao:  స్వేచ్ఛ,  బ్యూరో: హైదరాబాద్ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, దాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ నాయకుడు పంజాల గిరిధర్ గౌడ్.. తమ మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. అలాగే మాజీ టీడీపీ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన న్యాయవాది కవిత, పృథ్వీరాజ్ తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. కాగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీని అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిన కుట్ర వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో ప్రజలు స్పష్టమైన మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో మహిళలు, యువత ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కవిత, గిరిధర్ గౌడ్ తో పాటు అనేక మంది యువకులు, మహిళలు బీజేపీలో చేరడం పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి నిజంగా జరగాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

Also Read: Tata Discounts: టాటా అదిరిపోయే డిస్కౌంట్స్.. ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా 3.8 లక్షల తగ్గింపు!

Advertisement

శాంతి, సమైక్యత ప్రపంచంలో అరుదుగా ఉంటుంది 

అనంతరం బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. భారత్‌లో గంగా-జమున సంస్కృతి కొనసాగుతోందన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నారని స్పష్టంచేశారు. ఇలాంటి శాంతి, సమైక్యత ప్రపంచంలో అరుదుగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఉన్నా.. భారత్ లో మాత్రం శాంతితో జీవిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి మతానుసారంగా ఉత్సవాలను జరుపుకోవడం, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Also Read: WhatsApp AI Update: మీ వాట్సాప్‌లో ఈ మార్పును గమనించారా? కమ్యూనిటీ ట్యాబ్ మాయం, ఎందుకో తెలుసా?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×