E-Paper
Advertisement

Hyderabad: లిక్కర్ షాక్‌.. మూత తీయగానే బీర్ బాటిల్‌లో కదులుతున్న చేపపిల్ల.. వీడియో వైరల్

Hyderabad: లిక్కర్ షాక్‌.. మూత తీయగానే బీర్ బాటిల్‌లో కదులుతున్న చేపపిల్ల.. వీడియో వైరల్
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని నాచారం పరిధిలో ఉన్న మల్లాపూర్ ఒక వింత ఘటనకు వేదికైంది. సాధారణంగా బీరు బాటిళ్లలో నాణ్యత లోపాలు ఉన్నప్పుడు నలకలు లేదా చిన్నపాటి పురుగులు రావడం మనం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఏకంగా ఒక బీరు బాటిల్‌లో సజీవంగా ఉన్న చేపపిల్ల ప్రత్యక్షం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఒక వినియోగదారుడు వైన్ షాపులో బీరు కొనుగోలు చేసి, దానిని గమనించగా లోపల చేపపిల్ల ఈదుతుండటం చూసి విస్తుపోయాడు. ఈ వింతను చూసిన తోటి మందుబాబులు “బీరు కొంటే ఫిష్ ఫ్రై కి బదులు చేపనే ఫ్రీగా ఇచ్చారా?” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ ఘటనపై బాధితుడు వెంటనే సదరు వైన్ షాపు నిర్వాహకులను నిలదీశారు. అయితే, వారు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. “ఈ బాటిల్స్ మేము తయారు చేయము, నేరుగా కింగ్‌ఫిషర్ కంపెనీ నుండి వస్తాయి, కాబట్టి ఏవైనా ఫిర్యాదులు ఉంటే కంపెనీనే అడగండి” అంటూ వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్యాకింగ్ సీల్ వేసి ఉన్న బాటిల్‌లోకి చేపపిల్ల ఎలా వచ్చిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇది తయారీ ప్రక్రియలో జరిగిన లోపమా లేక నిల్వ ఉంచిన సమయంలో జరిగిన తప్పిదమా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

సాధారణంగా మద్యం బాటిళ్లలో అప్పుడప్పుడు నాచు పట్టడం లేదా గాజు ముక్కలు వంటివి రావడం చూసి వినియోగదారులు ఆందోళన చెందుతుంటారు. కానీ సజీవంగా ఉన్న ఒక జీవి బాటిల్‌లో కనిపించడం తయారీ కంపెనీల నాణ్యతా ప్రమాణాలను (Quality Standards) వేలెత్తి చూపుతోంది. లక్షలాది రూపాయల వ్యాపారం చేసే బహుళజాతి కంపెనీలు, బాటిలింగ్ ప్లాంట్లలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఇలాంటి అంశాల్లో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: రీల్స్ పిచ్చితో.. రైలులో వెర్రి వేషాలు.. చివరికి ఏమైందో చూడండి!

Advertisement

ప్రస్తుతం ఈ చేపపిల్ల బీరు బాటిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి ఘటనలపై తక్షణమే స్పందించి, సదరు వైన్ షాపుతో పాటు తయారీ యూనిట్లపై తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగదారులు కూడా ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు, ముఖ్యంగా పానీయాల విషయంలో సీల్, లోపల ఉన్న ద్రవ స్థితిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×