E-Paper
Advertisement

Telangana Electricity: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు.. క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana Electricity: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు.. క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం
Advertisement

Telangana Electricity: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని కోట్లాది మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీలను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. డిస్కంల ఆర్థిక లోటు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించడంతో పెంపు ప్రతిపాదనలు ఉండబోవని తెలుస్తోంది. గతంలోనే డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్ మెంట్(ఏఆర్ఆర్) ను సమర్పించాయి. కాగా గురువారం శుక్రవారం ఎన్పీడీసీఎల్ బహిరంగ విచారణ జరిగింది. శనివారం ఎస్పీడీసీఎల్ పరిధిలో చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ కొనసాగనుంది.

నాన్ టారిఫ్ ఇన్ కం ద్వారా..

ఎస్పీడీసీఎల్ 2026-27 సంవత్సరానికి గాను రూ.50153 కోట్లు అవసరమవుతాయని ఏఆర్ఆర్ సమర్పించింది. అయితే అందులో ప్రస్తుత టారిఫ్ ల ద్వారా రూ.40,378 కోట్లు వస్తుండగా క్రాస్ సబ్సిడీ సర్ చార్జ్, అడిషనల్ సర్ చార్జ్ ద్వారా రూ.198 కోట్లు, నాన్ టారిఫ్ ఇన్ కం ద్వారా రూ.83 కోట్లు సమకూరుతున్నట్లుగా పేర్కొంది. కాగా రూ.9,494 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్నట్లుగా పేర్కొంది. అలాగే ఎన్పీడీసీఎల్ 2026-27 సంవత్సరానికి గాను రూ.22,754 కోట్లు అవసరమవుతాయని విద్యుత్ నియంత్రణ మండలికి ఏఆర్ఆర్ సమర్పించింది. కాగా ప్రస్తుత టారిఫ్ ల ద్వారా రూ.10,233 కోట్లు సమకూరుతున్నట్లుగా చెప్పింది. మిగతా రూ.12,521 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.

రూ.22,015 కోట్లుగా అంచనా..

Advertisement

విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఎదుర్కొంటున్న భారీ ఆదాయ లోటును సామాన్యులపై రుద్దకుండా, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. సబ్సిడీల రూపంలో ఈ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించడం ద్వారా వినియోగదారులకు పాత ధరలకే విద్యుత్ అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన డిస్కంలు(ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) తమ ఆదాయం, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించాయి. మొత్తం మీద డిస్కంల రెవెన్యూ గ్యాప్ రూ.22,015 కోట్లుగా అంచనా వేశారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సుమారు రూ.9,494 కోట్ల లోటును ఎదుర్కొంటోంది. ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఏకంగా రూ.12,521 కోట్ల మేర ఆదాయ లోటు ఎదుర్కొంటోంది. కాగా ఈ గ్యాప్ ను రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

Also Read: Epic First Note: సంచారమే సాంగ్ ప్రోమో వచ్చింది.. స్పెషల్ ఏంటంటే?

నేడు ఎస్పీడీసీఎల్ బహిరంగ విచారణ

Advertisement

విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్-సబ్సిడీ-సర్ చార్జీల ప్రతిపాదనలపై శనివారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టనుంది. హైదరాబాద్ లోని విద్యుత్ నియంత్రణ భవన్ లో ఎస్పీడీసీఎల్ ఆదాయ అవసరాలపై ఈ విచారణ కొనసాగనుంది. వినియోగదారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, సూచనలను ఈ విచారణలో నేరుగా వెల్లడించవచ్చు. ఈ విచారణల అనంతరం టీజీఈఆర్సీ తుది టారిఫ్ ఆదేశాలను రిలీజ్ చేయనుంది.

ఎస్పీడీసీఎల్ 2026-27(రూ.కోట్లలో) 

ఏఆర్ఆర్ 50,153
కరెంట్ టారిఫ్స్ ద్వారా సమకూరేవి 40,378
క్రాస్ సబ్సిడీ, అడిషనల్ సర్ చార్జీల ద్వారా వచ్చేవి 198
నాన్ టారిఫ్ ద్వారా సమకూరేవి 83
రెవెన్యూ గ్యాప్ 9,494

ఎన్పీడీసీఎల్

ఏఆర్ఆర్ 22,754
కరెంట్ టారిఫ్స్ ద్వారా సమకూరేవి 10,233
రెవెన్యూ గ్యాప్ 12,521

Also Read: IND VS NZ Final: వాస్తు పిచ్చి, న్యూజిలాండ్ ఓడిపోయేలా BCCI కుట్ర‌లు…టీమిండియా కోసం స్పెష‌ల్ హోట‌ల్, డ్రెస్సింగ్ రూమ్స్‌

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×