E-Paper
Advertisement

Comedy Movie OTT : పని మనిషి పవరేంటో చూపించే క్రేజీ మూవీ… యజమానికి చుక్కలు చూపించే చక్కని సినిమా

Comedy Movie OTT : పని మనిషి పవరేంటో చూపించే క్రేజీ మూవీ… యజమానికి చుక్కలు చూపించే చక్కని సినిమా
Advertisement

Comedy Movie OTT : కొన్ని కామెడీ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మెసేజ్ తో పాటు మంచి కామెడీ ని కూడా అందిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కథ యజమాని పని మనిషికి ఉన్న రిలేషన్ తో నడుస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, చిన్నచూపు చూసే యజమానికి చెంప దెబ్బలా, కష్టపడి పని చేసే పని వాళ్ళకి కాలర్ ఎగరేసేలా ఉంటుంది. ఈ సినిమా మరాఠీలో సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. మరి దీని పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి

ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్

ఈ సూపర్ హిట్ మరాఠీ కామెడీ సినిమా పేరు ‘నాచ్ గా ఘుమ’ (Nach Ga Ghuma). నేషనల్ అవార్డ్ విన్నర్ పరేష్ మోకాషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ వంటి గొప్ప సినిమాలు తీసిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. ప్రముఖ నటుడు స్వప్నిల్ జోషి ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఇందులో రాణి పాత్రలో ముక్తా బార్వే, పనిమనిషి ఆశా పాత్రలో నమ్రత సంభేరావు నటించారు. ముఖ్యంగా నమ్రత తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ₹5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹27 కోట్లు వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రాణి అనే మహిళ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, ఇంటి పని, ఆఫీసు పని మేనేజ్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. దీంతో ఆమె ఒక పనిమనిషిని పెట్టుకుటుంది. అయితే ఇంట్లో ఉండే పనిమనిషి ఆశా తో అస్సలు పడదు. రోజూ ఏదో ఒక విషయంలో ఇద్దరికీ గొడవలే. ఒకానొక టైమ్ లో చిరాకు వచ్చి, ఆ పనిమనిషిని తీసేస్తుంది రాణి. కానీ ఆమె వెళ్ళిపోయాక అసలు సినిమా మొదలవుతుంది. ఇల్లు చిందరవందర అయిపోవడం, వంట కుదరకపోవడంతో రాణికి చుక్కలు కనిపిస్తాయి. కొత్త పనిమనిషి కోసం రాణి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎవరొచ్చినా ఆ పాత పనిమనిషిలా పని చేయరు, పైగా వీళ్ళ డిమాండ్లు భరించలేరు.

ఆఖరికి గతిలేక, మళ్ళీ అదే ఆశా కాళ్ళ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఈగోలు ఉన్నా, ఒకరి మీద ఒకరికి తెలియని ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆ పనిమనిషి లేకపోతే ఇల్లు గడవదు, ఈమె లేకపోతే ఆమెకు జీతం రాదు అన్నట్టు సాగుతుంది వీళ్ళ బంధం. చివరికి ఈ కథలో మెయిన్ పాయింట్ ఏంటంటే.. ఒక ఇంట్లో ఆడవాళ్లు (యజమానురాలు, పనిమనిషి) ఒకరికొకరు ఎలా సపోర్ట్ గా ఉంటారు అనేది చాలా కామెడీగా చూపిస్తారు. ఇద్దరి మధ్య గొడవలున్నా, కష్టమొస్తే మాత్రం ఒకరి కోసం ఒకరు నిలబడతారు. పనిమనిషి అంటే కేవలం జీతం ఇచ్చే మనిషి మాత్రమే కాదు, ఆమె కూడా కుటుంబంలో ఒక మనిషే అన్నట్టుగా ఈ సినిమా సరదాగా ముగుస్తుంది.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×