E-Paper
Advertisement

Romantic Drama OTT: రాణి గారి ప్రేమలో సేవకుడు… కళ్ళు చెదిరే సీన్స్… ఓ పట్టు పట్టాల్సిన సినిమా

Romantic Drama OTT: రాణి గారి ప్రేమలో సేవకుడు… కళ్ళు చెదిరే సీన్స్… ఓ పట్టు పట్టాల్సిన సినిమా
Advertisement

Romantic Drama OTT : రాజ కుటుంబాలలో రాజకీయాలు మామూలుగా ఉండవు. అధికారం కోసం ఏమైనా చేసేవాళ్ళు. ఇక సొంత రక్త సంబంధీకులను కూడా వదిలేవాళ్ళు కాదు. ఈ నేపథ్యంలో 18వ శతాబ్దంలో డెన్మార్క్ రాజకుటుంబంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగ ఒక సినిమా రూపొందింది. ఆకాలంలో రాణి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఆతరువాత స్టోరీ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉంటుంది ఈ హిస్టారికల్ సినిమాలో.

ప్రైమ్ వీడియో (prime video)లో స్ట్రీమింగ్ 

2012లో వచ్చిన ఈ హిస్టారికల్ మూవీ పేరు ‘ఎ రాయల్ ఎఫైర్’ (A Royal Affair). నికోలాజ్ ఆర్సెల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మాడ్స్ మిక్కెల్‌సెన్, అలీసియా వికాండర్, మిక్కెల్ బో ఫాల్స్‌గార్డ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో డాక్టరుగా నటించిన మాడ్స్ మిక్కెల్‌సెన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. అలాగే రాణిగా నటించిన అలీసియా వికాండర్ ఈ సినిమా తర్వాత హాలీవుడ్‌లో పెద్ద స్టార్ అయ్యారు. ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో రెండు సిల్వర్ బేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఆ ఏడాది టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇది ప్రైమ్ వీడియో (prime video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డెన్మార్క్ రాజు క్రిస్టియన్ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అతని భార్య ఒక రాణి అయినా కూడా ఒంటరితనంతో ఉంటుంది. ఆమె అంటే క్రిస్టియన్ కు ఇష్టం ఉండదు, ఎప్పుడూ తిరగడం, తాగి తందనాలాడటమే పని. పాపం బ్రిటన్ నుంచి వచ్చిన ఈ రాజకుమారి కరోలిన్ వాడిని చూసి తల పట్టుకుంటుంది. రాజ్యంలో ఏమీ తోచక, భర్త పట్టించుకోక ఆమె చాలా బాధపడుతుంటుంది. ఆ టైంలో రాజుకి వైద్యం చేయడానికి స్ట్రూన్సీ అనే డాక్టర్ వస్తాడు. అతను మామూలోడు కాదు, చాలా తెలివైనోడు. రాజుని తన మాటలతో బుట్టలో వేసుకుని, మెల్లగా రాజ్యంలో మార్పులు మొదలుపెడతాడు.

అదే టైంలో ఒంటరిగా ఉన్న రాణికి, ఈ డాక్టరుకి మధ్య సీక్రెట్ లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇద్దరూ కలిసి రాజుకి తెలియకుండా రాజ్యం మొత్తాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. కానీ ఈ విషయం రాజ్యంలో ఉన్న మిగతా పెద్దలకి నచ్చదు. ఎలాగైనా వీళ్ళని దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసి, రాణికి డాక్టరుకి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతారు. దాంతో డాక్టరుకి మరణశిక్ష పడుతుంది, రాణిని రాజ్యం నుంచి వెలేస్తారు. మంచి మార్పులు చేద్దామనుకున్న వాళ్ళ కథ ఇలా ట్రాజెడీగా ముగుస్తుంది.

Advertisement

Read Also : అరవై ఏళ్ళ ఆంటీ ప్రేమలో అందగాడు… ఇదెక్కడి వింత యవ్వారం సామీ

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×