E-Paper
Advertisement

Romantic drama OTT… టీనేజ్ వయసులో ప్రేమ…10 ఏళ్ల తర్వాత షాకింగ్ ట్విస్టులు… లవర్స్ చూడాల్సిన స్టోరీ

Romantic drama OTT… టీనేజ్ వయసులో ప్రేమ…10 ఏళ్ల తర్వాత షాకింగ్ ట్విస్టులు… లవర్స్ చూడాల్సిన స్టోరీ
Advertisement

Romantic drama OTT : మరో కొత్త కొరియన్ రొమాంటిక్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆడియన్స్ ఈ సిరీస్ ను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఇది 19 ఏళ్ల వయస్సులో ప్రేమలో పడి, ఒక చిన్న సంఘటన వల్ల విడిపోయిన ఇద్దరు వ్యక్తుల కథ. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత, అంటే 30 ఏళ్ల వయస్సులో వాళ్ళు మళ్ళీ కలుసుకున్నప్పుడు ఈ కథ ఆసక్తికరంగా తిరుగుతుంది. కొరియన్ డ్రామా ప్రేమికులు ఓ లుక్ వేయాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే….

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామా సిరీస్ పేరు ‘స్టిల్ షైనింగ్’ (Still Shining). ఇది 2026 మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ప్రతి శుక్రవారం రెండు కొత్త ఎపిసోడ్లు విడుదలవుతాయి. ఇందులో పార్క్ జిన్-యంగ్, కిమ్ మిన్-జు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ డ్రామాను ‘అవర్ బిలవ్డ్ సమ్మర్’ ఫేమ్ కిమ్ యూన్-జిన్ దర్శకత్వం వహించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పందొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు టా-సియో, యున్-ఆ ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడతారు. ఆ వయసులో వాళ్ళ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. కానీ ఊహించని ఒక చిన్న పొరపాటు వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. 20 ఏళ్ల వయసులో పంతాలు, పట్టింపుల వల్ల ఒకరిని విడిచి ఒకరు దూరంగా  వెళ్ళిపోతారు. సరిగ్గా పదేళ్ల తర్వాత, అంటే ముఫ్ఫై ఏళ్ల వయసులో విధి వీళ్లిద్దరిని మళ్లీ కలుపుతుంది. అప్పటి కల్లా వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయి ఉంటాయి.

ఇప్పుడు హీరో తన కలలను పక్కన పెట్టి ఒక సబ్‌వే డ్రైవర్‌గా స్థిరపడగా, హీరోయిన్ తన కష్టాలను ఎదురిస్తూ ఒక గెస్ట్‌హౌస్‌ను నడుపుతూ ఉంటుంది. అయితే విధి వదిలిపెట్టదు కదా, వీళ్లిద్దరూ మళ్లీ ఒకరికొకరు దగ్గరవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పాత కోపాలు, అలకలు ఉన్నా కూడా లోపల ఉన్న ప్రేమ మాత్రం చావదు. చివరికి ఆ పాత గాయాలు మానుతాయా? అప్పుడు వదిలేసిన ప్రేమను ఇప్పుడు మళ్లీ గెలిపించుకుంటారా? వీళ్ళ కథకు ఎలా శుభం కార్డ్ పడుతుంది ? అనే విషయాలను మాత్రం, ఈ కొరియన్ రొమాంటిక్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పొదుపు పేరుతో పాడు పని… మొగుళ్ళను కాదని మరొకరితో… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×