E-Paper
Advertisement

Romantic Drama OTT : ప్రేమించిన హృదయమే పగతో రగిలితే… ఓటీటీలోకి మైండ్ గేమ్ తో మెంటలెక్కించే స్టోరీ

Romantic Drama OTT : ప్రేమించిన హృదయమే పగతో రగిలితే… ఓటీటీలోకి మైండ్ గేమ్ తో మెంటలెక్కించే స్టోరీ
Advertisement

Romantic Drama OTT : ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది ఒక రొమాంటిక్ మూవీ. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. పాత కథే అయినా కొత్తగా చూపించడంతో ఈ సినిమా విజయాన్ని అందుకుంది. విజువల్స్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా అడుగుపెట్టబోతోంది. రొమాంటిక్ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది ? దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలోకి వస్తోందంటే

ఎమరాల్డ్ ఫెన్నెల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పేరు ‘వూదరింగ్ హైట్స్’ (Wuthering Heights). ఇందులో మార్గోట్ రాబీ (కేథరీన్ ఎర్న్‌షా), జాకబ్ ఎలోర్డి (హీత్‌క్లిఫ్) లీడ్ రోల్స్ లో నటించారు. 2026 ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు $80 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు $235 మిలియన్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. లక్కీచాప్ ఎంటర్టైన్మెంట్, వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమా,ఎమిలీ బ్రోంటే రాసిన క్లాసిక్ నవల ఆధారంగా రూపొందింది. ఇది 2026 మార్చి 30 నుండి Amazon Prime Video ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథ మొదట్లో ఒక ఒక ముసలాయనకకు, రోడ్డు మీద అనాథగా తిరుగుతున్న ఒక పిల్లాడు కనిపిస్తాడు. జాలిపడి అతన్ని ఇంటికి తీసుకొస్తాడు ఆ వ్యక్తి. ఇక ఆ ఇంట్లో ఉన్న కూతురు కేథరీన్ కి, ఈ కొత్త కుర్రాడికి మధ్య ఒక రేంజ్ లో సాన్నిహిత్యం పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే వీళ్లిద్దరూ కొండలు, కోనలు తిరుగుతూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత పిచ్చి ప్రేమలో పడిపోతారు. కానీ ఆ ఇంట్లోనే ఉన్న కేథరీన్ అన్న హిండ్లీకి మాత్రం హీత్‌క్లిఫ్ అంటే అస్సలు పడదు, వాణ్ణి ఒక పనివాడిలా చూస్తూ నానా హింసలు పెడతాడు.

కేథరీన్ కి హీత్‌క్లిఫ్ అంటే ప్రాణం ఉన్నా, సమాజంలో పరువు కోసం, ఆస్తి కోసం ధనవంతుడు అయిన ఎడ్గార్ లింటన్ ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. దీంతో హీత్‌క్లిఫ్ మనసు ముక్కలైపోయి, ఊరు వదిలి వెళ్ళిపోతాడు. కొన్ని ఏళ్ల తర్వాత సడన్‌గా ఫుల్ డబ్బుతో, ఒక రేంజ్ గెటప్‌తో తిరిగి వస్తాడు. తనను చిన్నచూపు చూసిన వాళ్లందరినీ నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని, పగతో రగిలిపోతూ అందరి జీవితాలతో ఆడుకుంటాడు. మరి ఇతని రివేంజ్ ఎలా సాగింది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  మసాజ్ చేస్తూ మర్డర్లు చేసే సైకో కిల్లర్… ఉత్కంఠ రేపుతున్న పాకిస్తానీ మూవీ… ఐయండిబిలో 9.4 రేటింగ్

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×