E-Paper
Advertisement

గురు శిష్యుల మధ్య చిచ్చు పెట్టె వయ్యారి భామ… 70 ఏళ్ల వయసులో ఇదేం పని ?

గురు శిష్యుల మధ్య చిచ్చు పెట్టె వయ్యారి భామ… 70 ఏళ్ల వయసులో ఇదేం పని ?
Advertisement

Romantic movie OTT : రొమాంటిక్ సినిమాలకు ఆదరణ ఎక్కువే ఉంటుంది. ఈ సినిమాలను యూత్ తో పాటు మిగతా ఆడియన్స్ కూడా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక కొరియన్ రొమాంటిక్ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక 70 ఏళ్ల వృద్ధ కవి, 17 ఏళ్ల హైస్కూల్ అమ్మాయిని ఇష్టపడే క్రమంలో ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఇందులో క్లైమాక్స్ మాత్రం యమ క్రేజీగా ఉంటుంది. హీరోయిన్ కిమ్ గో-యున్ తన అందంతో, నటనతో కుర్రాళ్లకి పిచ్చెక్కించేస్తుంది. ఆ వయసులో అంత చిన్న పిల్లను ఇష్టపడే కంటెంట్ ను చాలా మంది విమర్శించారు. అయినా కూడా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2012లో వచ్చిన ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘ఈంగ్యో’ (Eungyo). దీనికి జంగ్ జి-వూ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో ‘హ్యాపీ ఎండ్’ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా కూడా తీశాడు. ప్రస్తుతం సౌత్ కొరియాలో టాప్ హీరోయిన్‌గా ఉన్న కిమ్ గో-యున్కి ఇది మొదటి సినిమా. సుమారు 300 మందిని ఆడిషన్ చేసిన తర్వాత దర్శకుడు ఈమెను ఎంపిక చేశారు. తన తొలి సినిమాతోనే ఆమె ఏకంగా 8 ‘ఉత్తమ నూతన నటి’ అవార్డులను అందుకుని రికార్డు సృష్టించింది. ఇక 70 ఏళ్ల వృద్ధుడిగా కనిపించడానికి హీరో పార్క్ హే-ఇల్ ప్రతిరోజూ దాదాపు 10 గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. షూటింగ్ ముగిసిన తర్వాత ఆ మేకప్ తీయడానికి కూడా మరో 2 గంటలు పట్టేది. కొరియాలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. అప్పట్లోనే థియేటర్లలో సుమారు 13 లక్షల (1.3 million) పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతం Netflix, Viki ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

70 ఏళ్ల వయసున్న లీ జియోక్ ఒక గొప్ప కవి. రిటైర్ అయిపోయి ప్రశాంతంగా తన ఇంట్లో కాలం గడుపుతుంటాడు. ఒకరోజు 17 ఏళ్ల స్కూల్ పిల్ల ఈంగ్యో, ఆయన ఇంటి ముందున్న కుర్చీలో నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమెలోని అమాయకత్వం, యవ్వనం చూసి ఆ ముసలాయనకి తన పాత రోజులు గుర్తొస్తాయి. ఆ పిల్లని తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడు. ఆమెపై కలిగిన ఇష్టంతో, తన మనసులోని కోరికలను ఒక కథగా రాసుకుంటాడు. కానీ ఆ కవి దగ్గర శిష్యుడిగా ఉండే సియో జి-వూకి ఇది అస్సలు నచ్చదు. తన గురువు ఆ పిల్లతో అంత క్లోజ్‌గా ఉండటం చూసి తట్టుకోలేక కుళ్లుకుంటాడు. ఒకరోజు తన గురువు రాసిన ఆ కథను దొంగిలించి, తన పేరుతో పుస్తకం వేసి పెద్ద స్టార్ రైటర్ అయిపోతాడు.

ఇది తెలిసిన ముసలాయనకి తన శిష్యుడు చేసిన ద్రోహం చూసి ఒళ్లు మండిపోతుంది. అటు గురువుకి, ఇటు శిష్యుడికి ఆ పిల్ల విషయంలో ఒక రేంజ్‌లో గొడవలు మొదలవుతాయి. చివరికి ఆ శిష్యుడు ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించడం ముసలాయన చూసేస్తాడు. ఒక పక్క ఆ పిల్లతో అనుబంధం, మరోపక్క శిష్యుడి వెన్నుపోటు.. ఈ మధ్యలో ఆ ముసలాయన పడే నరకం మామూలుగా ఉండదు. ఒక సారి కోపంతో తన శిష్యుడి కారుని రిపేర్ చేసి అతన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఈ క్లైమాక్స్ చాలా క్రేజీగా ఉంటుంది. చివరికి ఈ ప్రమాదంలో శిష్యుడు చనిపోతాడా ? ఈంగ్యో ఎవరిని కోరుకుంటుంది ? ఈ కథకు ముగింపు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన బెస్ట్ హిస్టారికల్ మూవీస్ ఇవే… వీటిలో మీరెన్ని చూసారు ?

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×