E-Paper
Advertisement

ఇంటి కోడలు పనివాడితో ప్రేమలో పడితే… పెద్దలు చూడాల్సిన సినిమా

ఇంటి కోడలు పనివాడితో ప్రేమలో పడితే… పెద్దలు చూడాల్సిన సినిమా
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో ఎన్నో ఉన్నాయి. వస్తూనే ఉంటాయి కూడా. అయితే కొన్ని సినిమాలు పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. అలాంటి సినిమాల కోసం కొంతమంది కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. ఇది ఖచ్చితంగా అడల్ట్ సినిమా. ఇందులో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉంటాయి. అందుకే ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం. ఈ కథ పని వాడితో సంబంధం పెట్టుకునే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. ఇక సినిమా గురించి చెప్పే కంటే, చూస్తేనే అసలు మజా ఉంటుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2023లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ సినిమా పేరు ‘లిత్సోనెరాస్’ (Litsoneras). ఈ సినిమాను ఫిలిప్పీన్స్‌లో పంది మాంసం అమ్మే ప్రదేశంలో చిత్రీకరించారు. దర్శకుడు రోమన్ ఎస్. పెరెజ్ జూనియర్ ఈ కథను చాలా రఫ్ అండ్ టఫ్ గా చూపించారు. ఈ సినిమా ఫిలిప్పీన్స్ క్లాసిక్ మూవీ ‘ఇన్సియాంగ్’ కి కాస్త దగ్గరగా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన యెన్ దురానోకి ఇది కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ‘వివా ఫిల్మ్స్’ నిర్మించిన ఈ చిత్రం సుమారు 1 గంట 45 నిమిషాల పాటు సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ‘వివామాక్స్’ (Vivamax) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథ మినర్వా అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈమెకు ఒక పంది మాంసం అమ్మే షాపు ఉంటుంది. అయితే మొగుడు పక్కన ఉన్నా కూడా, తన షాపులో పనిచేసే కుర్రాడు జోనాస్‌తో మినర్వా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఈ విషయం ఆమె కూతురు ఎల్రియాకు తెలిసిపోతుంది. తన కళ్ల ముందే తల్లి చేస్తున్న ఈ పనిని చూసి ఎల్రియా రగిలిపోతుంది. తల్లి మీద కోపంతో ఎల్రియా ఊరుకోదు. ఆ జోనాస్ ను తన దారిలోకి తెచ్చుకుని, తల్లికి బుద్ధి చెప్పాలని ప్లాన్ వేస్తుంది.

అతన్ని తన ప్రేమ వలలో వేసుకుని, తల్లికి వాడికి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. కానీ ఈ క్రమంలో ఎల్రియా కూడా అదే కుర్రాడితో రిలేషన్‌లో పడిపోతుంది. ఒకరిని కొట్టబోతే ఇంకొకరు తగిలినట్టు, ప్లాన్ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఇంట్లో తల్లి, కూతురు ఇద్దరూ ఒకే కుర్రాడి కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. చివరకు ఈ గొడవ వల్ల ఆ కుటుంబం ఎలా ముక్కలైంది ? ఆ కుర్రాడి వల్ల వీళ్ల జీవితాలు ఎంత దారుణంగా తయారయ్యాయి ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్. మొత్తం మీద ఇదొక ఘాటైన రొమాంటిక్ అండ్ రివెంజ్ డ్రామా.

Advertisement

Read Also : వ్యూస్ పిచ్చితో వరుస హత్యలు చేసే హైస్కూల్ అమ్మాయిలు… వణికిపోతున్న ఊరి జనం

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×