E-Paper
Advertisement

స్టూడెంట్ ను ప్రేమించే టీచర్… వయసు తేడా ఉన్నా మనసులు కలిసిన ప్రేమ కథ

స్టూడెంట్ ను ప్రేమించే టీచర్… వయసు తేడా ఉన్నా మనసులు కలిసిన ప్రేమ కథ
Advertisement

Romantic Movie on OTT : ప్రేమ కథలు ఎన్నో రకాలగా ఆడియన్స్ న్ అలరిస్తుంటాయి. అయితే కొన్ని ప్రేమకథలు విచిత్రంగా మొదలై, విషాదాంతో ముగుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సినిమా అలాంటిదే. ఇది ఒక టీచర్, స్టూడెంట్ ల ప్రేమ కథతో మొదలవుతుంది.
1960ల కాలం నాటి కాలంలో జరిగే ఈ కథలో ఎలాంటి కమర్షియల్ హంగామా, ఫైట్లు, కామెడీ లాంటివి లేకుండా, ఇద్దరి మధ్య ఉండే బంధాన్ని గుండెలకు హత్తుకునేలా చూపిస్తారు. క్లైమాక్స్ అయితే కన్నీళ్ళు పెట్టిస్తుంది. క్లాసిక్ లవ్ స్టోరీలు, సెంటిమెంట్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ జర్మన్ టెలివిజన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘శ్వేగెమినుటె’ (Schweigeminute). అంటే దీని అర్థం ‘ఒక నిమిషం మౌనం’ అని. 2016లో వచ్చిన ఈ వెబ్ మూవీ ప్రముఖ జర్మన్ రచయిత సీగ్‌ఫ్రైడ్ లెంజ్ రాసిన నవల ఆధారంగా, థోర్‌స్టెన్ స్కిమిడ్ట్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రాన్ని జర్మనీకి చెందిన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ‘MOOVIE’ నిర్మించింది. కథ మొత్తం జర్మనీ బ్యాక్‌డ్రాప్‌లో సాగినప్పటికీ, 1960ల కాలం నాటి అందమైన సముద్ర తీరప్రాంత వాతావరణాన్ని విజువల్స్‌గా చూపించడం కోసం చిత్ర బృందం డెన్మార్క్‌కు చెందిన ‘బోర్న్‌హోల్మ్’ ఐలాండ్‌లో షూటింగ్ జరిపింది. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన నటీనటులు జర్మన్ పరిశ్రమలో ఎంతో గుర్తింపు పొందినవారు. టీచర్ పాత్రలో నటించిన జూలియా కోస్చిట్జ్ అవార్డు విన్నింగ్ నటి కాగా, విద్యార్థిగా నటించిన జోనాస్ నే అంతర్జాతీయంగా సూపర్ హిట్ అయిన ‘Deutschland 83’ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం IMDb లో 6.9/10 రేటింగ్‌తో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1960ల కాలంలో బాల్టిక్ సముద్ర తీరంలో ఉండే ఒక చిన్న ఊరిలో ఈ కథ జరుగుతుంది. క్రిస్టియన్ అనే 18 ఏళ్ల కుర్రాడు తన స్కూల్లో కొత్తగా చేరిన ఇంగ్లీష్ టీచర్ స్టెల్లా పీటర్సన్‌ను చూసి ఇష్టపడతాడు. మొదట్లో స్టెల్లా కాస్త దూరంగా ఉన్నా, మెల్లగా ఆమె కూడా క్రిస్టియన్‌ను ప్రేమించడం మొదలుపెడుతుంది. ఆ కాలంలో స్టూడెంట్, టీచర్ మధ్య ప్రేమ అంటే సమాజం ఒప్పుకోదు కాబట్టి, ఎవరికీ తెలియకుండా వీళ్లిద్దరూ ఒకరినొకరు కలుస్తూ తమ ప్రేమను దాచడానికి చాలా ప్రయత్నిస్తారు.

అయితే వాళ్ల సంతోషం ఎంతో కాలం నిలవదు. ఒకరోజు సముద్రంలో జరిగిన ఒక ఘోరమైన బోటు ప్రమాదంలో స్టెల్లా చనిపోతుంది. ఈ ఊహించని విషాదంతో క్రిస్టియన్ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తర్వాత స్కూల్లో స్టెల్లా జ్ఞాపకార్థం అందరూ కలిసి పాటించే ‘ఒక నిమిషం మౌనం’ (Schweigeminute) సమయంలో క్రిస్టియన్ ఆమెతో గడిపిన తీపి గుర్తులను, ఆ పవిత్రమైన ప్రేమను గుర్తుచేసుకోవడంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : తల్లి కోసం ఒక్కటయ్యే అక్కాచెల్లెళ్ళు… ఓటీటీలోకి వచ్చేసిన మరాఠీ ఫ్యామిలీ డ్రామా… ఐయండిబిలో 8.5 రేటింగ్

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×