E-Paper
Advertisement

సీఎం విజయ్‌తో వైఎస్ అనిల్‌రెడ్డి భేటీ, వచ్చేవారం కేంద్రం పెద్దలతో సమావేశం, వైసీపీ నేతల మాటలు నిజమేనా?

సీఎం విజయ్‌తో వైఎస్ అనిల్‌రెడ్డి భేటీ, వచ్చేవారం కేంద్రం పెద్దలతో సమావేశం, వైసీపీ నేతల మాటలు నిజమేనా?
Advertisement

Chennai: ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? తాజాగా మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి.. సీఎం విజయ్‌తో భేటీ వెనుక ఏం జరిగింది? వచ్చేవారం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం విజయ్ సమావేశం కానున్నారా? ఈలోగా వైఎస్ అనిల్‌రెడ్డి కలవడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.

సీఎం విజయ్‌తో వైఎస్ అనిల్‌రెడ్డి సమావేశం

Advertisement

వచ్చేవారం ఢిల్లీకి వెళ్లనున్నారు తమిళనాడు సీఎం విజయ్. కేంద్రం పెద్దలతో ఆయన వివిధ అంశాలపై సమావేశమై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రధానంగా భేటీ కానున్నారు సీఎం విజయ్. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే నిధుల నుంచి చర్చించనున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి రెండురోజుల కిందట సీఎం విజయ్‌తో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ విషయం తెలియగానే కూటమి నేతల్లో చర్చ మొదలైంది.  వీరిద్దరు సమావేశం వెనుక అజెండా ఏంటి? జగన్..  సీఎం విజయ్ ద్వారా బీజేపీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.

Advertisement

వచ్చేవారం కేంద్రం పెద్దలతో సీఎం విజయ్ సమావేశం

ఇంతకూ వైఎస్ అనిల్‌రెడ్డి ఎవరు? ఆయనకు జగన్‌కు ఉన్న సంబంధం ఏంటి? లిక్కర్ కేసులో వైఎస్ అనిల్‌‌రెడ్డి పేరు వెలుగులోకి ఎలా వచ్చింది? పులివెందులలో జన్మించి వైఎస్ అనిల్‌రెడ్డి. చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు కజిన్ బ్రదర్. ఆయన పెద్దనాన్న జార్జిరెడ్డి కొడుకు అనిల్‌రెడ్డి. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసినట్టు అనిల్‌‌రెడ్డిపై రకరకాల వార్తలు లేకపోలేదు.

జగన్‌కు సోదరుడే కాదు నమ్మకమైన ఆప్తుడు కూడా అనిల్‌రెడ్డి. జగన్‌ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్‌ స్కామ్‌ల్లో ఆయనపై ఆరోపణలున్నాయి.  లిక్కర్‌ స్కామ్‌లో అనిల్‌ రెడ్డి ప్రమేయంపై సిట్‌ విచారణ చేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో సిట్ సోదాలు చేసింది. వైఎస్ అనిల్‌రెడ్డి.. ఇళ్లు, కంపెనీల్లో సోదాలు చేసింది. ఆయనకు చెందిన చెన్నై, హైదరాబాద్ కంపెనీల్లో డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.

ALSO READ: CBSE సంచలనం.. 9, 10 తరగతులకు 3 భాషలు తప్పనిసరి.. రూల్స్ మారాయ్!

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే వైసీపీ నేతలు.. విజయ్ మావాడే అంటూ మీడియా ముందు నానా రచ్చ చేశారు. ఎన్నికల సమయంలో జగన్‌ ఎలాగైతే వ్యూహాలు రచించాడో దాని బాటలో టీవీకే అధినేత విజయ్ అడుగులు వేశారంటూ మీడియా ముందు పదే పదే చెప్పారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బీజేపీ పెద్దలతో జగన్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు కూటమి నేతలు.

 

Related News

పొలంలో గొయ్యి తవ్వి రూ.5 లక్షలు దాచిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత చూస్తే, అయ్యో పాపం!

వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

స్టార్ హోటల్‌లో దారుణం.. ఇద్దరు కూతుళ్లను చంపి, ఆ తర్వాత తండ్రి కూడా..

రణరంగంగా మారిన రాంచీ.. విద్యార్థుల ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం!

‘మోడియా బింద్’ గ్లాసెస్‌తో ఎంపీ రేణుకా చౌదరి నిరసన.. వీడియో వైరల్!

మధ్యప్రదేశ్‌లో విషాదం.. కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి!

మా పోరాటం ఆగదు.. మౌనం కాదు-హింసను ఆమోదించడమే- రాహుల్‌గాంధీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురూ.. ఎఎఐలో 389 జాబ్స్.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×