E-Paper
Advertisement

నాలుగు గోడల మధ్య నడిచే ట్రయాంగిల్ ప్రేమ… అలాంటి సీన్లతో మతి పోగొడుతున్న మూవీ

నాలుగు గోడల మధ్య నడిచే ట్రయాంగిల్ ప్రేమ… అలాంటి సీన్లతో మతి పోగొడుతున్న మూవీ
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అందులోనూ బోల్డ్ కంటెంట్ లో సినిమా అంటే నొరెళ్ళబెట్టి చూస్తుంటారు. అలాంటి వాళ్ళకోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. హాలీవుడ్ స్టార్ నటి ఎవా గ్రీన్ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు. ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో మొదట ఎవా గ్రీన్ తల్లిదండ్రులు, ఆమె ఏజెంట్ కూడా ఈ సినిమాలో నటించవద్దని ఆమెను బ్రతిమాలారు. ఇలాంటి పాత్రలు చేయడం వల్ల ఆమె కెరీర్ పాడైపోతుందని వాళ్ళు భయపడ్డారు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు శృంగార తారగా ఎవా కి మంచి గుర్తింపు కూడా వచ్చింది ఈ సినిమాతోనే.

ఎక్కడ చూడచ్చు అంటే

బెర్నార్డో బెర్టోలుచి దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ ఎరోటిక్ రోమాంటిక్ సినిమా పేరు ‘ద డ్రీమర్స్’ (The Dreamers).1968లో పారిస్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో ఎవా గ్రీన్, మైఖేల్ పిట్, లూయిస్ గారెల్ లీడ్ రోల్స్ లోనటించారు. గిల్బర్ట్ అడైర్ రాసిన ‘ద హోలీ ఇన్నోసెంట్స్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. బోల్డ్ సీన్స్ కారణంగా కారణంగా ఈ సినిమాకు A రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ అంతా పారిస్ నగరంలోనే జరిగింది. ఈ సినిమాతోనే ఎవా గ్రీన్ వెండితెరకు పరిచయమైంది. దర్శకుడు బెర్టోలుచి ఆమెను మొదటిసారి చూసినప్పుడు, ఆమె ఎంత అందంగా ఉందంటే, ఒక నేరం చేసేలా అనిపిస్తుంది అని కితాబిచ్చారు కూడా. ఇక నటీనటులు కెమెరా ముందు నగ్నంగా నటించడానికి ఇబ్బంది పడకుండా ఉండటానికి, షూటింగ్ మొదలవ్వడానికి చాలా ముందే ఒకరినొకరు బట్టలు లేకుండా చూసుకోవాలని, కలిసి సమయం గడపాలని దర్శకుడు చూచించడం కూడా జరిగిందంట. ప్రస్తుతం ఈ సినిమా ముబి, ఆపిల్ టివిలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అమెరికా నుండి చదువుకోడానికి మాథ్యూ అనే కుర్రాడు పారిస్ కి వస్తాడు. అక్కడ అతనికి థియో, ఇసాబెల్లె అనే అన్నచెల్లెళ్లు పరిచయమవుతారు. వాళ్ళిద్దరూ చూడటానికి భలే స్టైలిష్‌గా, సినిమా పిచ్చోళ్లలా కనిపిస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న వింత బంధం చూసి మాథ్యూ షాక్ అవుతాడు. కానీ వాళ్ళ స్నేహం నచ్చి వాళ్ళ ఇంట్లోనే దిగిపోతాడు. వాళ్ళ అమ్మానాన్నలు ఊరెళ్లడంతో ఆ ఇల్లు వీళ్ల ముగ్గురికీ ఒక అడ్డాగా మారుతుంది. ఇక ఇంటి లోపల వీళ్ల ముగ్గురిది ఒక వింత లోకం. బయట దేశంలో స్టూడెంట్స్ గొడవలు చేస్తూ, రాజకీయాలు నడుస్తుంటే.. వీళ్లు మాత్రం ఇంట్లో కూర్చుని మందు కొడుతూ, సినిమాల గురించి డిబేట్లు వేసుకుంటారు. మధ్యలో ఒంటి మీద బట్టలు విప్పేయడం, శృంగారం గురించి మాట్లాడుకోవడం లాంటి పనులతో హద్దులు దాటేస్తారు. ఆ ముగ్గురి మధ్య ఒక రకమైన రిలేషన్ ఏర్పడుతుంది. ఇక వీళ్ళ సరదాలు అలా సాగుతుండగా మాథ్యూ వాళ్ళకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఊహించని ఈ ట్విస్ట్ తో క్లైమాక్స్ ఆసక్తికరంగా మారుతుంది. చివరికి వీళ్ళ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడుతుందా ? మళ్ళీ సరసాలు మొదలెడతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పన్నెండేళ్ల క్రితం మాయమైన చెల్లి కోసం అక్క పోరాటం… థియేటర్లలో అలరించిన ‘షెల్బీ ఓక్స్’ ఇప్పుడు ఓటీటీలో

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×