Nitish Kumar Reddy Car: తెలుగు కుర్రాడు సన్రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ టోర్నమెంట్ లో SRH తరఫున అదరగొడుతూనే.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా టీం ఇండియాలో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. హార్దిక్ పాండ్యా తరహాలో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ప్లేయర్ నితీష్. అయితే అలాంటి నితీష్ కుమార్ రెడ్డి తాజాగా కొత్త కారు కొనుగోలు చేశాడు. రేంజ్ రోవర్ కారు ( Range Rover) కొనుగోలు చేసి… జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ( Peddama Talli Temple Jubilee Hills ) ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజలో తన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిపడేస్తాం Javed Miandad
ఇండియన్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు కుర్రాడు, SRH ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి రేంజ్ రోవర్ కార్ కొనుగోలు చేశాడు. ఈ కారు ధర రూ.3.24 కోట్లు ఉంటుంది. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు నితీష్ కుమార్ రెడ్డి. నిన్న ఏకంగా కారు కొనుగోలు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి, హైదరాబాదులోని ఓ ప్రముఖ షో రూమ్ కు వెళ్లిన నితీష్ కుమార్ రెడ్డి… కారును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు చేయించాడు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… మొన్నటి మినీ వేలంలో 6 కోట్లకు నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ జట్టులోకి వచ్చినప్పుడు 20 లక్షలు పలికిన నితీష్ కుమార్ రెడ్డి… అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఆరు కోట్ల దాకా ఎగబాకాడు. ఈ సీజన్ లో కూడా ఆల్రౌండర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ రెండు జట్లు హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్ ), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా(w), శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.
ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఔకిబ్ నబీ దార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్.
?igsh=MXJ5NHJoa29sZG9mNA==