E-Paper
Advertisement

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ
Advertisement

National Award Winning Drama: మనం ప్రతీరోజు కడుపునిండా తినే తిండి వెనుక, ప్రతీ ముద్ద వెనుక ఎంతమంది అనామక రైతుల కన్నీళ్లు, ఏ స్థాయి విషాదం దాగి ఉందో కళ్లకు కట్టినట్లు చూపించే హార్ట్ బ్రేకింగ్ సినిమా పేరే ‘కడ్వి హవా’ (Kadvi Hawa). సమాజంలో కళ్ల ముందు జరుగుతున్న ఒక కఠినమైన వాస్తవాన్ని ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అందుకే ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు నేషనల్ అవార్డ్స్‌ లో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కింది. మరి ఇలాంటి అద్భుతమైన సినిమాను మూవీ లవర్స్ ఎక్కడ చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే…

ఇటు ప్రకృతి వైపరీత్యాలు, అటు విపరీతమైన కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ఒక మారుమూల గ్రామంలో ఈ కథ నడుస్తుంది. రాజస్థాన్‌ లోని మహువా గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఒకప్పుడు వ్యవసాయంతో కళకళలాడిన ఈ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో పొలాలు ఎండిపోతాయి. పంటలు పండక రైతులకు ఆదాయం ఉండదు. కానీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు మాత్రం అలాగే ఉండిపోతాయి. అప్పులు తీర్చలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు కూడా ఆ దారిలోకి వెళ్లిపోతాడేమోనని భయపడుతుంటాడు హేడు. చూపు లేకపోయినా, తన కుటుంబానికి ఎదురవుతున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించే తండ్రి ఆయన.

Advertisement

హేడు కొడుకు ముకుంద్‌ కూడా అప్పుల భారంతో సతమతమవుతుంటాడు. వ్యవసాయం నుంచి ఆదాయం రాకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో అతడు తీవ్ర నిరాశలోకి వెళ్తాడు. తన కొడుకు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రాకూడదని హేడు ఆందోళన చెందుతుంటాడు. అదే సమయంలో గ్రామానికి గును బాబు అనే రుణాల వసూలు చేసే ఏజెంట్ వస్తాడు. అప్పులు చెల్లించని రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడమే అతడి పని. అతడి రాకతో గ్రామస్థుల్లో భయం మొదలవుతుంది. అప్పుల బాధతో ఇప్పటికే కుంగిపోయిన రైతులకు గును బాబు మరో సమస్యగా మారతాడు.

అయితే, గును బాబుకి కూడా మరో కథ ఉంటుంది. అతడు ఒడిశాలోని తీరప్రాంతానికి చెందిన వ్యక్తి. అక్కడ తరచూ వచ్చే తుపానులు, వరదలు అతడి కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతుంటాయి. ఒకవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న గ్రామం… మరోవైపు ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న తీరప్రాంతం. తన కొడుకును కాపాడుకోవాలనే తపనతో హేడు గును బాబుతో ఒక ఒప్పందానికి సిద్ధమవుతాడు. మొదట ఒకరికి మరొకరు విరోధులుగా కనిపించిన వీరిద్దరూ, క్రమంగా తమ కుటుంబాల భవిష్యత్తు కోసం ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఒప్పందం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ? హేడు తన కొడుకును కాపాడుకోగలుగుతాడా ? గును బాబు తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడా ? అన్నదే సినిమాలో చూడాల్సిన కథ.

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘కడ్వి హవా’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. హేడు పాత్రలో సంజయ్ మిశ్రా, బ్యాంకు ఏజెంట్ గా రన్వీర్ షోరే నటించారు. దర్శకుడు నీలా మాధబ్ పాండా చాలా రియలిస్టిక్‌గా సినిమాను తెరకెక్కించారు. పెద్ద పెద్ద డైలాగులు, కమర్షియల్ ట్విస్టులు లేకుండానే పాత్రల బాధను ప్రేక్షకుల కళ్ళకు కట్టారు. కొన్ని సన్నివేశాలు మనసును కలచివేస్తే, మరికొన్ని సన్నివేశాలు రైతుల జీవితాల గురించి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తున్నామో గుర్తుచేస్తాయి. ఆడియన్స్‌ను కంటతడి పెట్టించే ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ… రైతుల కష్టాలను, వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మనం తినే ఆహారం వెనుక ఉన్న శ్రమను, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కకపోతే రైతు కుటుంబం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో ఇందులో చూడవచ్చు. కుటుంబ సమేతంగా చూసి, మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది.

Read Also: లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

Related News

30 సెకన్ల ఇంధనంతో చంద్రుడిపై ల్యాండింగ్‌… ప్రాణాలకు తెగించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ప్రయాణం… మస్ట్ వాచ్ మూవీ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా

థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

 హర్రర్ నుంచి హీస్ట్ థ్రిల్లర్ వరకు ఈ వారం ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సినిమాలు… ఈ తెలుగు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×