E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ శివారు నాలుగు పార్లమెంట్లయిన చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పరిధిలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది నివసిస్తున్నారని, అయితే వారిని ఇక్కడ ఓట్లు నమోదు చేసుకోవద్దని ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లపై బెదిరింపులు, అక్రమ జోక్యం, ఓటరు నమోదు ప్రక్రియకు ఆటంకాలు, బీఎల్‌ఓలపై ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని, ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు.

రాంచందర్ రావు మాట్లాడుతూ..

Advertisement

అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ గడువు దగ్గరపడుతోందని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజల ఓట్లు బీజెపీకి పడుతాయని భయంతో బీఎల్వోలను వాళ్ళ దగ్గరికి పోకుండా కొందరు బెదిరింపులు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. వారికి ఇక్కడ ఓట్లు లేవని, వారి రాష్ట్రాల్లోనే ఓట్లు ఉన్నాయని.. వెళ్లి అక్కడే.. ఓట్లు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్, ఎంఐఎం నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఐటీ ఉద్యోగుల ఓట్లు ఇక్కడ లేవని చెబుతున్నారన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఇక్కడ హైదరాబాద్ లో నివాసముంటే ఓటు హక్కు పొందే అవకాశం ఉందని రాంచందర్ రావు తెలిపారు. ఈ రాష్ట్రమని, ఆ రాష్ట్రమని ఎలాంటి ప్రాంతీయ ఇబ్బందులు లేవన్నారు. ఓటు అనేది రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల ఓటర్లను బెదిరిస్తే సీఈవో దృష్టికి లేదంటే బీజేపీ దృష్టికి తీసుకురాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు అండగా బీజేపీ ఉంటుందని భరోసానిచ్చారు.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురండి..

Advertisement

ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ప్రతినిధుల సమావేశానికి రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల మోడీ పాలనలో రక్షణ రంగ ఎగుమతులు రూ.38,400 కోట్లకు పెరగడంతో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించిన మాజీ సైనికులు, రిటైర్మెంట్ తర్వాత సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై పోరాడాలని, సైనిక క్రమశిక్షణతో పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దేశ సమస్యలపై స్పందించడానికి ఈ సెల్

తెలంగాణలో తొలిసారిగా ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ప్రతి జిల్లా నుంచి కన్వీనర్లతో బలమైన టీమ్‌లను ఏర్పాటు చేసుకుని, పార్టీలో అత్యంత క్రియాశీలక వింగ్‌గా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. న్యాయవాదులకు లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్ ఎలాగైతే పనిచేస్తాయో, ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ కూడా దేశ సరిహద్దుల్లో సేవలు అందించిన సైనికులకు అండగా ఉంటుందని అన్నారు. కలెక్టరేట్లలో ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ బోర్డులు సక్రమంగా పనిచేసేలా చూడటంతో పాటు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి, దేశ సమస్యలపై స్పందించడానికి ఈ సెల్ చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 26న కార్గిల్ విజయ్ దివస్ ను రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని రాంచందర్ రావు సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం వనపర్తి నుంచి చీకటిమామిడి వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 12 కిలోమీటర్ల నిరసన పాదయాత్రకు రాంచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మండిపడ్డారు. వనపర్తి నుంచి చీకటిమామిడి వరకు ఉన్న 12 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరైనప్పటికీ, ఏండ్ల తరబడి పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రోడ్డంతా గుంతలమయమై బండ్లు నడవలేని పరిస్థితి నెలకొందన్నారు.

రాంచందర్ రావు ఫైర్..

ఈ అధ్వానపు రోడ్ల వల్లే ఎందరో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, కొత్త రోడ్లు మంజూరు చేయకపోగా, కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయడం లేదని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కనువిప్పు కోసమే ఈ 12 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.

Also Read: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×