Korean Romantic Drama: కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా తోడుండే ఒకే ఒక్క బాండ్ ఫ్రెండ్షిప్. ఎలాంటి టైమ్ లో అయినా తోడుండే ట్రూ ఫ్రెండ్ ను వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. అంతేకాదు వాళ్ళ లైఫ్ లోకి ఎవరైన స్పెషల్ పర్సన్ వచ్చినా కొంచం జెలసీగానే ఉంటుంది. కానీ ఏకంగా ఫ్రెండ్ లైఫ్ ను నాశనం చేసేంత అసూయ మాత్రం ఉండదు. ఒకవేళ అలా ఉంటే ఏం జరుగుతుందో తెలియాలంటే ‘ మై స్ట్రేంజ్ హీరో’ (My Strange Hero 2018) అనే ఈ కొరియన్ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఇందులో మెయిన్ లీడ్ పేరు కాంగ్ బోక్-సూ. అతను హైస్కూల్ రోజుల్లో చాలా సరదాగా ఉంటాడు. అంతేకాదు అందరికీ సహాయం చేస్తూ ఉండే మంచి విద్యార్థి. అతను సన్ సూ-జంగ్ అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ అదే స్కూల్లో చదివే ధనవంతుడైన ఓ సే-హో పై నుంచి కిందపడిపోవడానికి బోక్-సూ కారణమంటూ ఒక అబద్ధపు నింద పడుతుంది. ఆ నిందకు సూ-జంగ్ కూడా సాక్ష్యం చెబుతుంది. దాంతో బోక్-సూని స్కూల్ నుండి బహిష్కరిస్తారు.
ఆ ఒక్క సంఘటనతో అతని జీవితంలో కష్టాలు మొదలవుతాయి. తరువాత కథ 9 ఏళ్ల తర్వాతకు షిఫ్ట్ అవుతుంది. బోక్-సూ పెద్దవాడై ఒక చిన్న ప్రైవేట్ ఏజెన్సీని నడుపుతుంటాడు. కొన్ని అనుకోని పరిణామాల వల్ల అతను మళ్లీ అదే హైస్కూల్‌లో స్టూడెంట్‌గా చేరాల్సి వస్తుంది. అది కూడా 27 ఏళ్ల వయసులో. అప్పటికే అతని మాజీ ప్రేమికురాలు సూ-జంగ్ అదే స్కూల్‌లో టీచర్ గా పని చేస్తుంటుంది. అతనిని ఇరికించిన ఓ సే-హో ఆ స్కూల్ బోర్డ్ చైర్మన్‌గా ఉంటాడు.
బోక్-సూ తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ స్కూల్లోకి అడుగు పెడతాడు. కానీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడి విద్యావ్యవస్థలో ఉన్న అవినీతి, విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడి వంటి అనేక చేదు నిజాలు తెలుస్తాయి. అలాగే 9 ఏళ్ల క్రితం సూ-జంగ్ ఎందుకు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది ? ఓ సే-హో ఆత్మహత్యాయత్నం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? అనే విషయాలు కూడా బయట పడతాయి. ఇంతకీ హీరోని ఇరికించింది ఎవరు ? చివరికి అతని ప్రేమ, పగ ఏమయ్యాయి ? అన్న విషయం తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
యూత్ ను ఆకట్టుకునే కొరియన్ రొమాంటిక్ డ్రామా ‘మై స్ట్రేంజ్ హీరో’. యూ స్యుంగ్-హో, జో బో-ఆహ్, క్వాక్ డాంగ్-యోన్ నటించగా, 2018 లో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ కే-డ్రామా ప్రేమికుల ఫేవరెట్ లిస్ట్ లో ఉంటుంది. ఈ సిరీస్ ను Amazon Prime Videoలో చూడవచ్చు. కొరియన్ భాషలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. 9 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన బోక్-సూ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో తెలియాలంటే ఈ వీకెండ్ ఒక లుక్కేయండి.
Read Also: వరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్