BigTV English

OTT Movie : చావు కూడా భయపడే రేంజ్ లో సైకో టార్చర్… భయంతో నరాలు కట్ అయ్యే హర్రర్ మూవీ మావా… చూస్తే వారం నిద్ర పట్టదు

OTT Movie : చావు కూడా భయపడే రేంజ్ లో సైకో టార్చర్… భయంతో నరాలు కట్ అయ్యే హర్రర్ మూవీ మావా… చూస్తే వారం నిద్ర పట్టదు

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమా మాత్రం భయంతో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుంది. ఇందులో సైకో కిల్లర్ ఒక్కొక్కరినీ టార్చర్ చేసి చంపే విధానం చూస్తే వారం దాకా నిద్ర పట్టదు. అలాగే నరాలు కట్ అయ్యే రేంజ్ లో సస్పెన్స్ కూడా ఉంటుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


స్టోరీ
జాన్ క్రామర్ జిగ్సా (టోబిన్ బెల్) అనే సీరియల్ కిల్లర్ క్యాన్సర్ వ్యాధి చివరి దశలో ఉంటాడు. మెక్సికోలో చేసే ఓ అద్భుతమైన ట్రీట్మెంట్ ఈ క్యాన్సర్ ను నయం చేస్తుందని తెలుసుకుంటాడు. సెసిలియా పెడర్సన్ (సిన్నోవ్ మాకోడీ లండ్) అనే డాక్టర్ ఈ ట్రీట్మెంట్ చేస్తుంది. ఆమె ఒక ప్రత్యేక క్లినిక్‌ లో అత్యాధునిక వైద్య విధానాలను ఫాలో అవుతున్నామని చెబుతుంది. జాన్ ఎలాగైనా సరే బ్రతకాలనే ఆశతో సైకో కిల్లర్ నుంచి మంచి మనిషిగా మారి, మెక్సికో నగరానికి వెళతాడు.

అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సెసిలియా టీంను కలుస్తాడు. కానీ ఈ చట్రీట్మెంట్ ఒక పెద్ద మోసమని తెలుసుకోవడానికి అతనికి పెద్దగా టైమ్ పట్టదు. సెసిలియా, ఆమె బృందం (వాలెంటినా, మాటియో, గాబ్రియేలా, పార్కర్ వంటి వారు) క్యాన్సర్ రోగులను టార్గెట్ చేసి, డబ్బును దోచుకునే చీటింగ్ బ్యాచ్ అన్నమాట. విషయం తెలుసుకున్న జాన్ తీవ్ర నిరాశ, కోపంతో రగిలిపోతాడు. ఇంకేముంది మళ్ళీ తనలోని మృగాన్ని బయటకు తీసుకొచ్చి, సైకో కిల్లర్ గా మారిపోతాడు. సెసిలియా గ్యాంగ్ లో ఒక్కొక్కరినీ ఎలా చంపుతాడంటే అది చూసి చావుకే భయం పట్టుకుంటుంది. పైగా వీళ్ళను చంపడానికి అతను ఏర్పాటు చేసే ట్రాప్ లు చూస్తే గూస్ బంప్స్ పక్కా. ఆ బ్లడ్ బాత్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. అది మాత్రం డోంట్ మిస్.


Read Also : అవమానించాడని అమ్మాయిని తీసుకెళ్ళి ప్రెగ్నెంట్… ‘కెరెబేటె’ మూవీ రివ్యూ

తెలుగులోనే స్ట్రీమింగ్
ఈ దారుణమైన సైకో కిల్లర్ మూవీ పేరు ‘సా X’ (Saw X). 2023లో తెరపైకి వచ్చిన ఈ మూవీకి కెవిన్ గ్రాయుటర్ట్ దర్శకత్వం వహించారు. ఈ హారర్, మిస్టరీ, థ్రిల్లర్ చిత్రం ‘సా’ ఫ్రాంచైజీలో పదవ భాగం. కావడం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. IMDbలో 6.6 రేటింగ్ ఉన్న మూవీ ఇది.

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×