మూవీ : ‘కెరెబేటె’ కన్నడ మూవీ
దర్శకుడు : రాజ్‌గురు
నటీనటులు : గౌరీ శంకర్ ఎస్ఆర్జీ, బిందు శివరామ్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
Kerebete Movie Review : రాజ్‌గురు దర్శకత్వంలో వచ్చిన కన్నడ రొమాంటిక్ డ్రామా ‘కెరెబేటె’. (Kerebete). గౌరీ శంకర్, బిందు శివరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాది తరువాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మలనాడు (మలెనాడు) ప్రాంతంలోని సంప్రదాయ మత్స్య శికార క్రీడ అయిన ‘కెరెబేటె’ చుట్టూ తిరిగే కథ. ప్రేమ, కుల వివక్ష, సామాజిక సమస్యలు వంటి అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ 2024 మార్చి 15న థియేటర్లలో విడుదలై, పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video)లో (రెంట్ ఆప్షన్‌తో) స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
కథ కర్ణాటకలోని మలనాడు ప్రాంతంలోని తీర్థహళ్లి, సొరబ, సాగర ప్రాంతాల్లో జరుగుతుంది. నాగ (గౌరీశంకర్ SRG) ఒక మొరటోడు. కలప రవాణా స్మగ్లింగ్‌లో పాల్గొని తరచూ జైలుకు వెళ్తుంటాడు. అతని తల్లి (హరీని శ్రీకాంత్) ఒక అనాథ. దళిత కులానికి చెందిన మహిళ కావడంతో, వారసత్వంగా రావలసిన ఆస్తిని తండ్రి తరపున వారు ఇవ్వరు.
ఈ నేపథ్యంలోనే నాగ… మీనా (బిందు శివరామ్)ను ప్రేమిస్తాడు. కానీ ఆమె తండ్రి (గోపాలకృష్ణ దేశపాండే) ఈ విషయం తెలిసి… నాగతో పాటు అతని తల్లిని అవమానిస్తాడు. ఈ అవమానం, కోపంతో నాగ మీనాను కిడ్నాప్ చేస్తాడు. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. ఎనిమిది నెలల తర్వాత మీనా గర్భవతిగా తిరిగి వస్తుంది. కానీ నాగ ఆచూకీ లేకుండా పోతాడు. ఈ సంఘటనలు కెరెబేటె (మత్స్య శికార క్రీడ) ఉత్సవాల సందర్భంగా జరుగుతాయి. అసలు కెరెబేటె, నాగ మిస్సింగ్ కు ఉన్న లింకు ఏంటి? నాగ ఏమయ్యాడు? అతని గతం ఏంటి? అనే విషయాలను మూవీలో చూడాల్సిందే.
విశ్లేషణ
రాజ్‌గురు తన తొలి చిత్రంలో మలనాడు సంస్కృతిని అద్భుతంగా చూపించడం సక్సెస్ అయ్యాడు. కానీ ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. గౌరీశంకర్, రాజ్‌గురు రాసిన స్క్రీన్‌ప్లే సెకండాఫ్ లో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, ఫస్టాఫ్ మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. ఎమోషనల్ సీన్స్ అంతగా కనెక్ట్ కావు. అలాగే కొన్ని ట్విస్ట్ లు ముందే ఊహించే విధంగా ఉన్నాయి. అయితే చివరి 30 నిమిషాలు, కథలో ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఎడిటర్ కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. కీతన్ పూజారి సినిమాటోగ్రఫీ మలనాడు హరియాళి ప్రకృతిని, సాంప్రదాయ కెరెబేటె క్రీడను అద్భుతంగా బంధించింది. గగన్ బడేరియా సంగీతం, నేపథ్య స్కోర్ గ్రామీణ వాతావరణానికి సరిగ్గా సరిపోయాయి.
నాగ పాత్రలో గౌరీశంకర్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. అతని రగ్గడ్ లుక్, భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా అతని సహకారం ప్రశంసనీయం. మీనా పాత్రలో బిందు ఆకర్షణీయంగా ఉంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
సినిమాటోగ్రఫీ
సంగీతం
సెకండాఫ్
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
చివరగా
IMDbలో 9.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా ‘కాంతార’, ‘రంగితరంగ’ వంటి సినిమాల అభిమానులకు బెస్ట్ ఆప్షన్. ఫస్టాఫ్ ఓపికగా చూస్తే, సెకండాఫ్ మంచి ఫీల్ ఇస్తుంది.
Kerebete Movie Rating : 2/5