Geetha Krishna: ఈ మధ్యకాలంలో సింగర్స్ పై అభియోగాలు వింటున్నాం. మొన్న ప్రవస్తి, సింగర్ సునీత, ఎంఎం కీరవాణిలపై చేసిన ఆరోపణలు మనం చూసాం.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సింగర్ సిద్ శ్రీరామ్ పై కామెంట్స్ చేసారు. ఆయన దర్శకునిగానే కాక సినిమాలకు సంగీతాన్ని కూడా సమకూరుస్తారు. ఇప్పుడు తాజాగా సిద్ శ్రీరామ్ గురించి గీతాకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు గురించి ఇప్పుడు చర్చించుకుందాం..
తెలుగు రాదు కానీ.. పాటకి పది లక్షలు..
గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్, ప్రముఖ సినీ దర్శకుడు. గీతాకృష్ణ సంకీర్తన అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సంకీర్తన. ఈ సినిమా సక్సెస్ ని అందుకోవడంతోపాటు నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరమ్మ గారి అబ్బాయి వంటి చిత్రాలతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో స్థానాన్ని సంపాదించారు గీతాకృష్ణ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు పాట పాడడం రాకపోయినా పాటకి పది లక్షలు తీసుకొని పాడే వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. సిద్దు శ్రీరామ్ యూఎస్ నుంచి వస్తాడు. 10 పాటలు పాడి వెళ్ళిపోతాడు. పాటకు 10 లక్షలు చొప్పున తీసుకుంటాడు. పరమ దరిద్రంగా తెలుగు పాటల్ని పాడతాడు. బాలు గారు కూడా ఎందుకు ఇలా తెలుగు రాని వారితో పాడిస్తున్నారు అంటూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అతని పేరు అయితే బయటికి చెప్పకుండా బాలు గారు నాతో అన్నారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా తెలుగు సరిగ్గా పలకడం రాకుండా పాట పాడితేనే నచ్చుతున్నారు. లేటెస్ట్ ట్రెండ్ అలా మారిపోయింది. బ్రహ్మాండంగా పాడే సింగర్స్ తెలుగులో చాలామంది ఉన్నారు. అలాంటివారిని, కీరవాణి లాంటి వాళ్ళును పైకి రానివ్వరు. వాళ్లకి అనుకూలంగా ఉంటేనే వారిని ఎంకరేజ్ చేస్తారు అని గీతాకృష్ణ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా నిజంగా తెలుగులో పాడే వారు చాలామంది ఉంటే.. ఎక్కడో అమెరికా నుంచి సింగర్స్ ని తీసుకువచ్చి పాడిస్తున్నారు. మన తెలుగువారిని ఎంకరేజ్ చేయాలి అంటూ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సిద్ శ్రీరామ్ పాటల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
సీద్ శ్రీరామ్ పాటలు ..
సిద్ శ్రీరామ్ అల వైకుంఠపురం సినిమాలో ‘సామజ వరగమన’ పాట ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేమూవీ లో ‘నీలి నీలి ఆకాశం’ ఎంత హీట్ అయిందో అందరికీ తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమాలో ‘మగువా మగువా’ అనే సాంగ్, శశి సినిమాలో ‘ఒకే ఒక లోకం నువ్వే’ అనే సాంగ్ తో సిద్ శ్రీరామ్ సూపర్ హిట్ ఆల్బమ్ ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన పాడిన పాటలకు ఎక్కువ మొత్తంలో చార్జి చేస్తారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.
?igsh=MWk3eHI5YTBlbml2bQ==