E-Paper
Advertisement

Sci-Fi Thrillers OTT : బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు… ఒక్కోటి ఒక్కో విజువల్ వండర్… ఇందులో మీరెన్ని చూశారు ?

Sci-Fi Thrillers OTT : బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు… ఒక్కోటి ఒక్కో విజువల్ వండర్… ఇందులో మీరెన్ని చూశారు ?

Sci-Fi Thrillers OTT : ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. రకరకాల జనార్లలో ఆడియన్స్ ను అలరిస్తుంటాయి. అయితే వీటిలో సై-ఫై థ్రిల్లర్స్ మాత్రం మైండ్ ను బెండ్ చేస్తుంటాయి. ఈ జానర్ లో అలాంటి కొన్ని సినిమాలను ఒక్కసారి చూస్తే, మెదడు గిర్రున తిరిగిపోతుంది. ఇప్పుడు సై-ఫై థ్రిల్లర్ లవర్స్‌ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలపై ఓ లుక్ వేద్దాం. ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 5 మూవీస్ చూస్తే మీ మెదడు పూర్తిగా బెండ్ అవుతుంది.

1. అలిటా: బ్యాటిల్ ఏంజెల్ (Alita: Battle Angel)

జేమ్స్ కామెరాన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఫ్యూచర్‌లో సాగుతుంది. ఇందులో ఒక సైబోర్గ్ అమ్మాయి తన గతాన్ని మరచిపోయి ఆ తరువాత గుర్తు చేసుకుంటుంది. బ్యాటిల్ ఏంజెల్‌గా మారి శత్రువులతో ఫైట్ చేస్తుంది. యాక్షన్ సీన్స్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి చూస్తున్నంత సేపు మెదడు పని చేయకుండా పోతుంది. 2019లో వచ్చిన ఈ సినిమా Netflixలో అందుబాటులో ఉంది.

2. ఎండర్స్ గేమ్ (Ender’s Game) 

అసా బటర్‌ఫీల్డ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సై-ఫై ఎపిక్ 2013లో వచ్చింది. ఇందులో భవిష్యత్తులో భూమిని రక్షించడానికి పిల్లలను ట్రైన్ చేసి యుద్ధానికి పంపుతారు. ఎండర్ అనే అబ్బాయి సూపర్ ఇంటెలిజెన్స్‌తో గేమ్‌లాంటి ఈ యుద్ధాల్లో వీరోచితంగా పోరాడుతాడు. కానీ చివరి ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అవుతుంది. Netflix లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

3. ఎక్స్‌టింక్షన్ (Extinction)

మైఖేల్ పెనా, లిజ్జీ కాప్ నటించిన ఈ సినిమా – ఒక మనిషి రిపీటెడ్ డ్రీమ్స్‌లో భయంకర దాడులు చూస్తాడు. అది డ్రీమ్ కాదు, ఫ్యూచర్ అటాక్ అని తెలిసిన తర్వాత స్టోరీ మారుతుంది. టైమ్ లూప్, ఎలియన్ ఇన్వేషన్ మిక్స్ తో స్టోరీ నడుస్తుంది. 2018లో వహీన ఈ సినిమా Netflixలో అందుబాటులో ఉంది.

4. పసిఫిక్ రిమ్ (Pacific Rim) 

ఈ మెగా యాక్షన్ సై-ఫై గాలీస్ డెల్ టోరో దర్శకత్వంలో వచ్చింది. భూమిని రక్షించడానికి భారీ రోబోట్స్ తో ఎలియన్ మాన్స్టర్స్‌తో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. చూస్తున్నంత సేపు మెదడు గిర్రున తిరిగిపోతుంది. Netflixలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

5. టుమారోల్యాండ్ (Tomorrowland)

ఇది జార్జ్ క్లూనీ, బ్రిట్ రాబర్ట్సన్ నటించిన డిస్నీ సై-ఫై అడ్వెంచర్. 2015 ఒక ఫ్యూచర్ సిటీ (టుమారోల్యాండ్)లోకి వెళ్లే రహస్యం తెలుస్తుంది. మానవాళి భవిష్యత్తును కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. Jio Hotstarలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : అయ్యబాబోయ్… సైబర్ క్రైమ్స్ ఇలా జరుగుతాయా ? ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

Tags

Related News

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

Big Stories

×