E-Paper
Advertisement

రహస్య పట్టణంలో చిక్కుకుపోయే సీక్రెట్ ఏజెంట్… నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న టెన్షన్ తోనే పోతారు భయ్యా

రహస్య పట్టణంలో చిక్కుకుపోయే సీక్రెట్ ఏజెంట్… నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న టెన్షన్ తోనే పోతారు భయ్యా
Advertisement

Science fiction mystery thriller OTT : మామూలు సిరీస్ లు చూసి బోర్ కొట్టిందా ? అయితే మెదడుకి పని పెట్టే గట్టి సస్పెన్స్ ఉన్న సిరీస్ ను చూసేయండి. ఈ కథ ఒక ఊరి చుట్టూ కోట గోడలాగా కరెంటు కంచె పెట్టి, అందులో జనాన్ని బంధిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఊరు చూడటానికి భలే అందంగా ఉన్నా, ఎవరైనా బయటకు పోవాలని చూస్తే లేపేస్తారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా భయం. అసలు ఆ ఊరి జనం ఎందుకు అలా ఉంటున్నారు, ఆ కంచె అవతల ఏముంది అనే విషయాలను చాలా థ్రిల్లింగ్‌గా చూపిస్తారు ఇందులో. మొదట్లో ఏదో మామూలు మిస్టరీలా మొదలై, ఆ తర్వాత అస్సలు ఊహించని రేంజ్‌లో సైన్స్ ఫిక్షన్ కథలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని సీటు అంచున కూర్చోబెట్టేలా సీన్లు ఉంటాయి ఇందులో. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ, క్లైమాక్స్‌లో ఇచ్చే షాక్ మాత్రం మామూలుగా ఉండదు. మీకు మిస్టరీ సినిమాలు, బుర్ర తిరిగిపోయే ట్విస్టులు అంటే ఇష్టం అయితే, ఇది మీకు ఒక క్రేజీ రైడ్ లాంటిది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘వేవార్డ్ పైన్స్’ (Wayward Pines). ప్రముఖ రచయిత బ్లేక్ క్రౌచ్ రాసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ పుస్తకాల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. 2015లో ఎం. నైట్ శ్యామలన్ నిర్మాణంలో ఈ సిరీస్ ప్రారంభమైంది. ఆయన తన సినిమాల్లో ఉండే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఈ సిరీస్ లో కూడా అద్భుతంగా చూపించారు. అందుకే రెండు సీజన్లతో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సిరీస్‌లో హాలీవుడ్ నటుడు మాట్ డిల్లాన్‌తో పాటు, భారతీయ నటి నిమ్రత్ కౌర్ కూడా రెండవ సీజన్‌లో ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం. ఫాక్స్ నెట్‌వర్క్ 2016లో రెండవ సీజన్ తర్వాత ఈ షోను నిలిపివేసినప్పటికీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇప్పటికీ ఒక ‘కల్ట్ క్లాసిక్’గా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈథన్ బర్క్ అనే ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్, తప్పిపోయిన తన ఇద్దరు సహచరుల కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ‘వేవార్డ్ పైన్స్’ అనే ఒక చిన్న పట్టణానికి వస్తాడు. చూడటానికి ఆ ఊరు చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడకు వెళ్ళిన కొద్దిసేపటికే ఈథన్‌కు ఏదో తేడాగా అనిపిస్తుంది. తన ఫోన్ పని చేయదు, ఊరి నుండి బయటకు వెళ్లే దారులు అన్నీ మూసుకుపోయినట్లు ఉంటాయి. ఆ ఊరి ప్రజలు కూడా ఏదో భయంలో బతుకుతున్నట్లు, ఒక రకమైన వింత నిబంధనలను పాటిస్తూ ఉంటారు. తను ఎలాగైనా బయటపడాలని ఈథన్ ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ఊరి చుట్టూ ఉన్న సీక్రెట్స్ బయటపడతాయి.

ఆ ఊరి చుట్టూ ఒక పెద్ద ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది. ఎవరైనా బయటకు వెళ్లాలని చూస్తే చంపేస్తారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ప్రపంచం మొత్తం అంతమైపోయి దాదాపు రెండు వేల ఏళ్లు దాటిపోయింది. మానవ జాతి అంతరించిపోకుండా ఉండటానికి డేవిడ్ పిల్‌చర్ అనే సైంటిస్ట్ కొంతమందిని ఎంచుకుని, భవిష్యత్తులో ఈ ఊరిని సృష్టించాడు. అయితే ఆ కంచె బయట ‘అబ్బీస్’ అనే భయంకరమైన రాక్షస మనుషులు తిరుగుతుంటారు. వాళ్ళు కనిపిస్తే మనుషులను పీక్కుతింటారు. ఈ నిజం తెలిసిన తర్వాత, ఈథన్ ఆ ఊరిని కాపాడటానికి నాయకుడిగా మారతాడు. లోపల ఉండే మనుషుల మధ్య గొడవలు, బయట ఉండే రాక్షసుల దాడుల మధ్య ఆ పట్టణం ఎలా బతికి బట్టకట్టింది అనేదే ఈ కథలోని అసలు ఉత్కంఠ.

Advertisement

Read Also : చిన్న డిటెక్టివ్ చేతికి పెద్ద కేసు… నవ్వులు పూయిస్తూనే వెన్నులో వణుకు పుట్టించే మర్డర్ మిస్టరీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×