ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇండియా గవర్నమెంట్ మింట్ (IGM) నోయిడా యూనిట్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 94 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. సూపర్‌వైజర్ నుంచి జూనియర్ టెక్నీషియన్ వరకు పలు రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఖాళీల వివరాలు ఇలా..
మొత్తం 94 పోస్టులలో అత్యధికంగా జూనియర్ టెక్నీషియన్ విభాగంలో 65 ఖాళీలు ఉన్నాయి. సూపర్‌వైజర్ పోస్టులు 9 ఉండగా.. ఎన్‌గ్రేవర్ (మెటల్ వర్క్స్) విభాగంలో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు అసిస్టెంట్లు అలాగే టైపిస్టుల విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి. లాబొరేటరీ అసిస్టెంట్ కేటగిరీలో 1 ఖాళీ ఉంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్ వంటి టెక్నికల్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ అవుతున్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 94
విద్యార్హతలు, వయస్సు వివరాలు..
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో విద్యార్హతలు నిర్ణయించారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో పాటు బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు.. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు లభిస్తుంది.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. సూపర్‌వైజర్ పోస్టులకు రూ. 27,600 నుంచి రూ. 95,910 వరకు చెల్లిస్తారు. ఎన్‌గ్రేవర్ పోస్టులకు రూ. 23,910 నుంచి రూ. 85,570 మధ్య వేతనం ఉంటుంది. లాబొరేటరీ అసిస్టెంట్ అభ్యర్థులకు రూ. 21,540 నుంచి రూ. 77,160 వరకు.. జూనియర్ టెక్నీషియన్లకు రూ. 18,780 నుంచి రూ. 67,390 వరకు శాలరీ లభిస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ పరీక్ష (CBT) ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అర్హత గల వారు కేవలం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రక్రియ 2026 మార్చి 28న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఏప్రిల్ 27వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ సందర్శించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు తనిఖీ చేయవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://igmnoida.spmcil.com/
ALSO READ: డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. జీతం రూ.78,390.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ బ్రో