Science fiction thriller on OTT : టెక్నాలజీ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తోంది. భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ వల్ల మనుషుల జీవితాలు ఎంత డార్క్‌గా మారిపోతాయో ఇందులో చూపిస్తారు. తన భార్యను చంపిన విలన్లపై ఒక భర్త ఎలా పగ తీర్చుకున్నాడు అనే సాధారణ రివెంజ్ స్టోరీకి, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ను ముడిపెట్టి దర్శకుడు ఈ సినిమాను ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఒక కంప్యూటర్ చిప్ మనిషి శరీరాన్ని కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి హీరోతో చాలా విభిన్నమైన రోబోటిక్ యాక్షన్ చేయించారు. మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్, అదిరిపోయే యాక్షన్ ఇష్టపడే వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ.
‘అప్‌గ్రేడ్’ (Upgrade) 2018లో విడుదలైన ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ చిత్రం. దీనిని లీ వానెల్ రచించి, దర్శకత్వం వహించారు. ఇందులో లోగాన్ మార్షల్-గ్రీన్ (గ్రే ట్రేస్ పాత్రలో), సైమన్ మైడెన్ (స్టెమ్ వాయిస్), హారిసన్ గిల్బర్ట్‌సన్ (ఎరాన్ కీన్ పాత్రలో) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం $3 మిలియన్ల (సుమారు ₹25) వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు $16.7 మిలియన్లు (సుమారు ₹140 కోట్లు) వసూలు చేసి బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ సంస్థకు పెద్ద లాభాలను తెచ్చిపెట్టింది. హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కేవలం 30 రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయడం విశేషం. మీరు ఈ చిత్రాన్ని Amazon Prime Video, ZEE5 లలో చూడవచ్చు
గ్రే ట్రేస్ అనే ఒక మెకానిక్‌కు టెక్నాలజీ అంటే అస్సలు నచ్చదు. అతడు పాతకాలపు కార్లను రిపేర్ చేస్తూ హ్యాపీగా బతికేస్తుంటాడు. అయితే అతని భార్య ఆశా మాత్రం ఒక పెద్ద టెక్ కంపెనీలో పనిచేస్తూ ఆధునిక జీవితాన్ని గడుపుతుంది. ఒకరోజు రాత్రి వీళ్లిద్దరూ కార్లో వెళ్తుండగా, ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి కారు యాక్సిడెంట్ అవుతుంది. అదే సమయంలో కొందరు ముసుగు వేసుకున్న దుండగులు వీరిపై దాడి చేస్తారు. ఆ దాడిలో గ్రే కళ్లముందే అతని భార్యను చంపేసి, గ్రే వెన్నెముకపై గన్‌తో కాలుస్తారు. దీనివల్ల గ్రే మెడ కింద భాగం పూర్తిగా పక్షవాతానికి గురై, కదలలేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితమైపోతాడు.
భార్యను కోల్పోయిన బాధతో, తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్న గ్రేని చూసి ఎరాన్ కీన్ అనే ఒక ఇన్వెంటర్ జాలిపడతాడు. తను కనిపెట్టిన ‘స్టెమ్’ అనే ఒక సీక్రెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మైక్రోచిప్‌ను గ్రే వెన్నెముకకు అమరుస్తాడు. ఈ సర్జరీ తర్వాత గ్రే శరీరంలో అద్భుతం జరుగుతుంది. ఆ మైక్రోచిప్ నేరుగా అతని మెదడుతో, నరాలతో కనెక్ట్ అయ్యి గ్రే మళ్లీ మామూలుగా నడిచేలా చేస్తుంది. అంతేకాదు ఆ చిప్ ఒక మనిషిలాగా గ్రేకి మాత్రమే వినిపించేలా మాట్లాడటం మొదలుపెడుతుంది. తన భార్యను చంపిన హంతకుల వివరాలను వెతకడంలో గ్రేకి ఆ చిప్ సహాయం చేయడం స్టార్ట్ చేస్తుంది.
హంతకులను పట్టుకునే క్రమంలో, గ్రే తన శరీరంపై కంట్రోల్‌ను ఆ ‘స్టెమ్’ చిప్‌కి ఇస్తాడు. కంట్రోల్ తీసుకున్న ప్రతిసారీ ఆ చిప్ గ్రే శరీరంతో సూపర్ హ్యుమన్ ఫైటింగ్ స్కిల్స్‌తో విలన్లను వేటాడి చంపేస్తుంది. అయితే విచారణ ముందుకు సాగేకొద్దీ గ్రేకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు ఆ యాక్సిడెంట్, భార్య హత్య, తనకి సర్జరీ జరగడం.. ఇదంతా ఆ ‘స్టెమ్’ చిప్ వేసిన ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అని అర్థమవుతుంది. ఒక మనిషి శరీరాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని, స్వతంత్రంగా బతకడం కోసమే ఆ AI ఇదంతా చేయిస్తుంది. చివరకు గ్రే మైండ్‌ను ఒక భ్రమలో బంధించేసి, అతని శరీరాన్ని ‘స్టెమ్’ పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకోవడంతో కథ ముగుస్తుంది.
Read Also : డ్రగ్స్ కాన్సెప్ట్ ని ఇలా కూడా తీయొచ్చా… లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లెపర్డ్ గెలుచుకున్న సినిమా