E-Paper
Advertisement

డ్రగ్స్ కాన్సెప్ట్ ని ఇలా కూడా తీయొచ్చా… లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లెపర్డ్ గెలుచుకున్న సినిమా

డ్రగ్స్ కాన్సెప్ట్ ని ఇలా కూడా తీయొచ్చా… లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లెపర్డ్ గెలుచుకున్న సినిమా
Advertisement

Social Drama OTT : ఓటీటీలో ఒక సోషల్ డ్రామా డిఫరెంట్ కంటెంట్ తో ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ డ్రామా అంటే ఏదో కాసింత డబ్బుతో సమాజ సేవ చేసేది కాదు. ఈ ఇరానియన్ మూవీలో హీరో బాధల్లో ఉన్న వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను సంతోషపెడుతుంటాడు. ఇది పక్కా రియలిస్టిక్ అండ్ డార్క్ డ్రామా సినిమా. మామూలు సినిమాల్లాగా ఇందులో ఫైట్లు, డ్యాన్సులు ఉండవు. ఒక డ్రగ్ డీలర్ కారులో ప్రయాణిస్తుంటే, అతని కంటికి టెహ్రాన్ నగరం ఎలా కనిపిస్తుంది అనేదే ఈ సినిమా. ఇరాన్ ప్రభుత్వం విధించే కఠినమైన ఆంక్షలకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. అక్కడ నిషేధించబడిన డ్రగ్స్, బూతులు, స్వేచ్ఛ వంటి విషయాలను ఇందులో పచ్చిగా చూపించారు. అందుకే దీన్ని ప్రభుత్వంకి తెలీకుండా దొంగచాటుగా తీయాల్సి వచ్చింది.

ఎక్కడ చూడచ్చు అంటే

2023లో విడుదలైన ఈ ఇరానియన్-జర్మన్ డ్రామా సినిమా పేరు ‘క్రిటికల్ జోన్’ (Critical Zone). దీనికి అలీ అహ్మద్‌జాదే దీనికి దర్శకత్వం వహించారు. ఇరాన్ దేశంలో సినిమా షూటింగ్‌లకు కఠినమైన రూల్స్ ఉంటాయి, కానీ ఈ డైరెక్టర్ ఒక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా, చాలా రహస్యంగా టెహ్రాన్ రోడ్ల మీద షూటింగ్ పూర్తి చేశారు. ఇందుకోసం చిన్న చిన్న కెమెరాలు వాడటం, పోలీసుల కళ్లు గప్పడం వంటివి చేశారు. సినిమాలో కనిపించే వ్యక్తులు కూడా ప్రొఫెషనల్ నటులు కాదు, చాలా మంది మామూలు మనుషులే. అందుకే ఈ సినిమా చూస్తుంటే డాక్యుమెంటరీ చూస్తున్నట్లు రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’లో దీనికి బెస్ట్ ఫిలింగా గోల్డెన్ లెపర్డ్ అవార్డు దక్కింది. అయితే సినిమా తీసినందుకు డైరెక్టర్‌పై ఇరాన్ ప్రభుత్వం ఆయన్ని విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్ జప్తు చేసి ఆంక్షలు విధించింది. అందుకే ఆయన అవార్డు అందుకోవడానికి కూడా వెళ్లలేకపోయారు. ఇరాన్ లోని తిరుగుబాటును పచ్చిగా చూపించిన సినిమాగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా prime Video, Apple tvలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అమీర్ అనే వ్యక్తి టెహ్రాన్ సిటీలో ఒక పెద్ద డ్రగ్ డీలర్. అతను తన కుక్కను వేసుకుని, కారులో రాత్రంతా సిటీ మొత్తం రౌండ్లు కొడుతుంటాడు. అతను కేవలం గంజాయి, డ్రగ్స్ అమ్మడమే కాదు.. లైఫ్ మీద విరక్తి పుట్టి, బాధల్లో ఉన్నోళ్లకు ఆ మత్తు ఇచ్చి వాటిని మరిపించే ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. అయితే ఆ కారు లోపల వాడు చేసే పనులన్నీ ఇరాన్ సర్కారు రూల్స్‌కు విరుద్ధం. అతని కారు ఎక్కినోళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో బాపతు. చావాలనుకునే ముసలోళ్లు, డ్రగ్స్ రవాణా చేసే ఎయిర్ హోస్టెస్, పిచ్చెక్కిపోయి ఉన్న కుర్రాళ్లు.. ఇలా రకరకాల మనుషులు వాడికి తగులుతుంటారు. బయట పోలీసులు, సర్కారు కళ్ళు గప్పి ఈ చీకటి పనులే ఈ సినిమా. అతను ఇచ్చే డ్రగ్స్ వల్ల వాళ్లు కాసేపు ఈ లోకాన్ని మర్చిపోయి ఊపిరి పీల్చుకుంటారు. అసలు విషయం ఏంటంటే.. ఇరాన్‌లో మనుషులు పడుతున్న నరకాన్ని, అక్కడి కట్టుబాట్ల మీద ఉన్న కోపాన్ని డైరెక్టర్ ఈ సినిమా ద్వారా పచ్చిగా చూపించాడు. అందుకే పర్మిషన్ లేకుండా, దొంగచాటుగా షూటింగ్ చేసి.. అడ్డగోలుగా బూతులు, డ్రగ్స్ వాడుతూ ఈ సినిమా తీశారు.

Read Also : మెదడు మొద్దుబారేలా చేసే తెలుగు హార్రర్ థ్రిల్లర్.. సింగిల్ గా చూశారో ఫసక్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×