BigTV English

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : రొమాంటిక్ స్టోరీలంటే చెవి కోసుకునే ప్రేక్షకులు తక్కువేమి లేరు. హాలీవుడ్ సినిమాలలో ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఒంటరిగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సినిమా కామెడీ జానర్ లో వచ్చింది. ఈ కథ ‘అందం కంటే మనసు ముఖ్యం’ అనే స్లోగన్ తో మొదలవుతుంది. దాదాపు 150 కేజీలు ఉండే ఒక యువతితో, హీరో ప్రేమలో పడే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘షాలో హాల్’ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఫారెల్లీ బ్రదర్స్ (బాబీ, పీటర్) దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జాక్ బ్లాక్ (హాల్), గ్వినెత్ పాల్ట్రో (రోజ్మేరీ) ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2001 నవంబర్ 9న అమెరికాలో రిలీజ్ అయింది. 1 గంట 54 నిమిషాల రన్‌ టైమ్ తో, IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

హాల్ అనే అబ్బాయి అందమైన అమ్మాయిలను మాత్రమే లైక్ చేస్తుంటాడు. వాళ్ళతో మాత్రమే డేట్ చేస్తూ రాక రకాల అందాలను ఆస్వాదిస్తుంటాడు. అతని ఫ్రెండ్ మారిసియో కూడా అలాంటివాడే. వీళ్ళిద్దరూ అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు వాలిపోతుంటారు. హాల్ కి చిన్నప్పుడు, అతని తండ్రి ‘మనసు మంచిదైతే చాలు, లుక్స్ ఇంపార్టెంట్ కాదు’ అనే విషయం చెప్పి ఉంటాడు. అయితే తండ్రి మాటను లెక్క చేయకుండా, అతని పని అతను కానిస్తుంటాడు. ఒక రోజు హాల్, టోనీ రాబిన్స్ అనే వ్యక్తిని కలుస్తాడు. ఉన్నట్టుండి హాల్‌ని టోనీ హిప్నటైజ్ చేస్తాడు. అప్పట్నుంచి హాల్ అమ్మాయిలలో అందాన్ని కాకుండా, వాళ్ళ మనసు చూస్తాడు. హిప్నటిజం వల్ల హాల్ అమ్మాయిలను డిఫరెంట్‌గా చూస్తాడు. మనసు మంచిగా ఉంటే, ఎవరైనా అందంగా కనిపిస్తారు అనే ధోరణిలో ఉంటాడు.


ఈ సమయంలో అతను రోజ్మేరీ అనే యువతిని కలుస్తాడు. రోజ్మేరీ చాలా మంచి అమ్మాయి, హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. కానీ రియల్‌ గా ఆమె చాలా లావుగా ఉంటుంది. దాదాపు 300 పౌండ్లతో ఉంటుంది. ఇంత భారీ ఆకారం ఉన్నా, హిప్నటిజం వల్ల, హాల్‌కి మాత్రం నాజూకైన అందంగా కనిపిస్తుంది. అతని కళ్ళకు ఆమె సన్నగానే కనిపిస్తుంది. ఇక వాళ్ళు లవ్‌లో కూడా పడి, డేటింగ్ స్టార్ట్ చేస్తారు. కథ ఇలా నడుస్తుండగా, హాల్ మీద ప్రయోగించిన హిప్నటిజాన్ని మారిసియో తీసేస్తాడు. ఇప్పుడు హాల్ రోజ్మేరీ రియల్ లుక్స్ చూసి షాక్ అవుతాడు. ఈ క్లైమాక్స్ ఒక ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. హాల్ అందానికే ఇంపార్టెన్స్ ఇస్తాడా ? 300 పౌండ్ల ఆకారాన్ని ఇష్టపడతాడా ? ఈ క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.

Read  Also : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

Big Stories

×