OTT Movie : వెబ్ సిరీస్ లు ఓటీటీలలో ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వీటిని చూడటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఎలాంటి జానర్ కావాలన్నా ఒక్క క్లిక్ తో వాలిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో వచ్చి, ఆడియన్స్ ని అలరించింది. భార్యా, భర్తల మధ్య జరిగే ఒక ఎమోషనల్ డ్రామాను ఈ బెంగాలీ సిరీస్ చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ….
‘అంటర్మహల్’ (ANTORMAHAL) 2023లో విడుదలైన బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్. దీనికి అజ్జు వి.ఆర్. దర్శకత్వం వహించారు. ఇందులో ఇషా సాహా, సౌరవ్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ IMDbలో 8.0/10 రేటింగ్ పొందింది. ఈ సిరీస్ hoichoi, Amazon Prime Videoలో ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రితి, ఇంద్రో ఒక యంగ్ కపుల్. ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళకు పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత బిడ్డ కోసం ట్రై చేస్తారు. కానీ రితికి ప్రెగ్నెంట్ కావడం కష్టంగా ఉంటుంది. డాక్టర్ ఇద్దరూ ఫెర్టిలిటీ టెస్ట్ చించుకోమని చెప్తాడు. కానీ ఇంద్రో నాకు ఏం ప్రాబ్లమ్ లేదు అని ఈగోతో టెస్ట్ చేయడానికి ఒప్పుకోడు. ఇది రితికి కోపం, బాధ తెప్పిస్తుంది. ఆమెకు ఫ్యామిలీ నుంచి “బిడ్డ ఎప్పుడు?” అని ప్రెషర్ వస్తుంది. సొసైటీలో బిడ్డ లేకపోతే జనం ఏం అనుకుంటారో అని రితి టెన్షన్‌లో ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. రితి ఒంటరిగా ఫీల్ అవుతుంది, ఇంద్రో ఆమె బాధను అర్థం చేసుకోడు. రితి డిప్రెషన్‌లోకి వెళ్తుంది. రితి తన సమస్యను సాల్వ్ చేయడానికి ఫెర్టిలిటీ క్లినిక్‌కి వెళ్తుంది. ఆమె ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఇంద్రో ఇంకా సపోర్ట్ చేయడు.
రితి ఒక ఫ్రెండ్ సహాయంతో, ఇంద్రోకి చెప్పకుండా ట్రీట్‌మెంట్ కొనసాగిస్తుంది. అయితే ఈ సీక్రెట్ ఇంద్రోకి తెలిసిపోతుంది. అతను కోపంతో ఆమె మీద, నీకు నా మీద నమ్మకం లేదా అని అరుస్తాడు. వాళ్ళ మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుంది. ఆమె మెంటల్‌గా బ్రేక్‌డౌన్ అవుతుంది, తన మ్యారేజ్ గురించి డౌట్‌లో పడుతుంది. ఈ సమయంలో రితి, ఇంద్రో మధ్య పెద్ద ఎమోషనల్ ఫైట్ వస్తుంది. ఆమె ఒంటరిగా ఫీల్ అవుతోందని, ఇంద్రో సపోర్ట్ లేకపోవడం వల్ల మ్యారేజ్ బ్రేక్ అవుతోందని. ఇది ఇంద్రోకి కళ్ళు తెరిపిస్తుంది. రితి తన బాధను ఓపెన్‌గా చెబుతుంది. చివరికి ఇంద్రో తన ఈగోని పక్కనపెట్టి, ఫెర్టిలిటీ టెస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడా ? వీళ్లకు పిల్ల్లలు పుట్టే అవకాశం ఉందా ? వీళ్ళ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందా ? అనే విషయాలను ఈ బెంగాలీ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్