AP GST Collections: పన్నుల రాబడిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తుంది. సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. నికర జీఎస్టీ వసూళ్లలో 7.45 శాతం వృద్ధి సాధించింది. సెప్టెంబర్ లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,789 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ ప్రారంభం అయ్యాక రెండో అతి పెద్ద స్థూల రాబడి నమోదు చేసింది ఏపీ. గత ఏడాది సెప్టెంబర్ తో పోల్చితే ఈ సెప్టెంబరులో స్థూల జీఎస్టీ వసూళ్లలోనూ 4.19 శాతం వృద్ధి సాధించింది.
ఈ సెప్టెంబర్ లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,653 కోట్లకు చేరుకున్నాయి. ధరల తగ్గింపు ప్రకటనల నేపథ్యంలో కొనుగోళ్ల లావాదేవీలు తగ్గినప్పటికీ పన్నుల రాబడిలో ఏపీ వెనుకబడింది. రాష్ట్ర జీఎస్టీ (SGST) రాబడిలో సెప్టెంబర్ నెలలో 8.28 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది ఎస్‌జీఎస్టీ రాబడి గణనీయంగా పెరిగింది.
పెట్రోలియం ఉత్పత్తులపైన రూ.1,380 కోట్ల రాబడితో 3.10 శాతం వృద్ధి నమోదు చేసింది ఏపీ. కూటమి ప్రభుత్వం పన్నుల వసూళ్లలో సాంకేతితకు పెద్ద పీట వేసింది. కృత్రిమ మేథ, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC), ఆటోమేషన్, డేటా డ్రైవన్ ఓవర్‌సైట్ మెకానిజమ్ లాంటి విప్లవాత్మక విధానాలను వాణిజ్య పన్నుల శాఖ అమలుచేస్తుంది.
జీఎస్టీ వసూల్లు సెప్టెంబర్‌లో 9.1% పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టులో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది ఆగస్టు 2024లో రూ.1.75 లక్షల కోట్ల కంటే 6.5% అధికంగా నమోదయ్యాయి. 2025 ఆగస్టులో నికర వసూళ్లు 10.7% పెరిగి రూ.1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జులైలో రిటర్న్స్ కారణంగా నికర ఆదాయాలు రూ.1.68 లక్షల కోట్లకు తగ్గాయి.
ఏప్రిల్-ఆగస్టు కాలానికి జీఎస్టీ ఆదాయం మొత్తం రూ.10.04 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.9.13 లక్షల కోట్లుగా ఉన్నాయి.
సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ నాలుగు పన్ను స్లాబ్‌లను రెండుకు తగ్గించింది. 12%, 28% రేట్లను రద్దు చేసి 5%, 18% స్లాబ్‌లను మాత్రమే కొనసాగిస్తుంది. లైఫ్, హెల్త్ ఇన్యూరెన్స్ పై జీఎస్టీని రద్దు చేసింది.
Also Read: Festival Special Trains 2025: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పండుగ రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో!
సెప్టెంబర్ 22, 2025 నుంచి జీఎస్టీ నూతన స్లాబ్ లు అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, చూయింగ్ పొగాకు, జర్దా, బీడీ వంటి కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ పెంచింది.