E-Paper
Advertisement

Korean Web series : చిక్కుల్లో పడే చిన్ననాటి ప్రేమ… క్రేజీగా సాగే ప్రతీ ఎపిసోడ్

Korean Web series : చిక్కుల్లో పడే చిన్ననాటి ప్రేమ… క్రేజీగా సాగే ప్రతీ ఎపిసోడ్
Advertisement

Korean Web series : కొరియన్ డ్రామాలంటే చెవి కోసుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ని చూస్తే నిజమేనని అనిపిస్తుంది. ఈ సిరీస్ కొరియాలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా సూపర్ హిట్ అయింది. ఇది చిన్నప్పుడు ఎంతో అందంగా ఉండి, పెరిగేకొద్దీ తన లుక్స్ కోల్పోయిన అమ్మాయి, చిన్నప్పుడు లావుగా ఉండి, పెద్దయ్యాక ఎంతో అందంగా మారే ఒక అబ్బాయి మధ్య సాగే కథ ఇది. చూసే కొద్దీ చూడాలనిపించే ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడచ్చు ఈ సిరీస్ ను అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘షీ వాజ్ ప్రిటీ’ (She Was Pretty). ఇందులో హ్వాంగ్ జంగ్-ఇయుమ్, పార్క్ సియో-జూన్, గో జూన్-హీ, చోయి సి-వోన్ నటించారు. ఇది MBCలో 2015 సెప్టెంబర్ 16 నుండి నవంబర్ 11 వరకు ప్రసారం అయింది. ఈ సిరీస్ దేశీయంగా 18.4% హై రేటింగ్‌తో సూపర్ హిట్ కాగా, ముఖ్యంగా చైనాలో ఈ సిరీస్ ని తెగ చూశారు. ఇప్పుడు 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్‌తో MX Player లో ఉచితంగా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

హ్యే-జిన్ చిన్నప్పుడు చాలా అందంగా ఉండేది, కానీ పెరిగేకొద్దీ వాళ్ల నాన్న పోలికలు వచ్చి తన అందాన్ని కోల్పోతుంది. అదే సమయంలో ఆమె చిన్ననాటి స్నేహితుడు సుంగ్-జూన్ చిన్నప్పుడు లావుగా, చూడటానికి అంత బాగోకపోయినా.. పెద్దయ్యాక మాత్రం ఒక మోడల్‌లా అందంగా మారిపోతాడు. అతను ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా మారి అమెరికా నుంచి కొరియాకు వస్తాడు. తన చిన్ననాటి క్రష్ అయిన హ్యే-జిన్‌ను కలవాలని అతను ఆమెకు ఫోన్ చేస్తాడు. తన రూపాన్ని చూసి అతను ఎక్కడ రిజెక్ట్ చేస్తాడో అని భయపడి, హ్యే-జిన్ తన అందమైన స్నేహితురాలు హారిని తనలా నటించమని పంపిస్తుంది.

కట్ చేస్తే హ్యే-జిన్ ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ఆఫీసులో ఇంటర్న్‌గా చేరుతుంది. దురదృష్టవశాత్తు అదే ఆఫీసులో సుంగ్-జూన్ బాస్‌గా ఉంటాడు. తను ఎవరన్నది తెలియక సుంగ్-జూన్ ఆఫీసులో ఆమెను చాలా వింతగా చూస్తూ, తిడుతూ ఉంటాడు. మరోవైపు హ్యే-జిన్ మంచితనాన్ని చూసి ఆఫీసులోనే ఉండే షిన్-హ్యుక్ ఆమెతో ప్రేమలో పడతాడు. చివరికి ఈ గందరగోళంలో సుంగ్-జూన్‌కి అసలు విషయం ఎప్పుడు తెలిసింది? తన స్నేహితురాలే తనను మోసం చేసిందని తెలిశాక అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? హ్యే-జిన్ ఎవరి ప్రేమను పొందుతుంది ? అనే విషయాలను, కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : కూతురి మిస్సింగ్ తో అడవిలో హడలెత్తిపోయే అడ్వెంచర్… ఓటీటీలోకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×