BigTV English
Advertisement

OTT Movie : ఇదెక్కడి పిచ్చి ప్రేమ సామీ… బతికుండగానే భార్యను బలిచ్చి దెయ్యంతో డీల్… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్స్

OTT Movie : ఇదెక్కడి పిచ్చి ప్రేమ సామీ… బతికుండగానే భార్యను బలిచ్చి దెయ్యంతో డీల్… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్స్

OTT Movie : సూపర్‌న్యాచురల్ ఎలిమెంట్స్, బ్లాక్ మ్యాజిక్, ఇస్లామిక్ థీమ్ తో నిండిన కథలు తీవ్రమైన టెన్షన్ లెసన్‌లతో ఆకట్టుకుంటాయి. 2016లో రిలీజ్ అయిన అలాంటి ఒక గ్రిప్పింగ్ టర్కిష్ హారర్ మూవీ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. సాధారణంగా లేడీ విలన్లు ఉన్న సినిమాలను ఎన్నింటినో ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ ఇందులో ఉన్న లేడీ విలన్ క్యారెక్టర్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది మావా.


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ 

ఈ 93 నిమిషాల టర్కిష్ హారర్ మూవీ పేరు Siccîn 3. అల్పర్ మెస్త్చి దర్శకత్వంలో, ఫిల్మ్ రోజ్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ 2016 సెప్టెంబర్ 2న టర్కీలో రిలీజైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ట్యూబీ, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో బ్యూస్రా అయాయ్డిన్ (కాహ్దర్), ఎలిఫ్ బయ్సల్ (ఇర్మా), నెవిన్ ఎఫె (కాహ్దర్ మదర్), డెనిజ్ గుండోగ్దు (ఇర్మా మదర్), సెల్చుక్ యున్సల్ (ఓర్హాన్) తదితరులు నటించారు. IMDbలో ఈ మూవీకి 6.0 రేటింగ్ మాత్రమే ఉంది. కానీ బ్యూస్రా అయాయ్డిన్ పెర్ఫార్మెన్స్, సూపర్‌ న్యాచురల్ విజువల్స్ మంచి ప్రశంసలు అందుకున్నాయి. సినిమా టర్కీలో మంచి బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంది. అలాగే సియాడ్ అవార్డ్‌కు నామినేట్ అయింది. ‘సిచ్చిన్’ ఫ్రాంచైజ్ లో ఇది మూడవ ఇన్‌స్టాల్‌మెంట్. బ్లాక్ మ్యాజిక్, రివేంజ్ థీమ్స్‌ తో ఈ మూవీ హర్రర్ మూవీ లవర్స్ ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

స్టోరీలోకి వెళ్తే… 

కథ సెడాట్, కాహ్దర్ అనే సోదరులు…. వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఓర్హాన్ చుట్టూ తిరుగుతుంది. ముగ్గురూ చిన్నప్పటి నుండి కలిసి ఉండడమే కాదు, సంతోషకరమైన జీవితం గడుపుతారు. ఓర్హాన్… కాహ్దర్‌ ను పెళ్లి చేసుకుని, ఓ ఫ్యామిలీగా సెటిల్ అవుతాడు. అయితే ఈ సోదరులు అనుకోకుండా ఒక యాక్సిడెంట్‌లో చిక్కుకుంటారు. తరువాత సెడాట్ చనిపోతాడు. వీళ్ళిద్దరితో కలిసి ప్రయాణించిన కాహ్దర్ బతికి బయట పడుతుంది. కానీ వికలాంగురాలవుతుంది. ఓర్హాన్, తన భార్య కాహ్దర్‌ను కాపాడుకోవడానికి ఒక డెవిల్ తో డీల్ చేస్తాడు. బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి భార్యను కాపాడుకోవాలి అనుకుంటాడు.


అతను ఒక షమాన్ (హోజా) సహాయంతో, కాహ్దర్‌ను రక్షించడానికి ట్రై చేస్తాడు. కానీ ఇది తన ఫ్యామిలీకి మరింత డార్క్ కాన్సెక్వెన్సెస్ తెస్తుంది. ఓర్హాన్ డీల్ ఫలితంగా, కాహ్దర్‌పై బ్లాక్ మ్యాజిక్ ప్రభావం పడుతుంది. సూసైడ్ అటెంప్ట్స్ నుంచి మొదలు పెడితే భయంకరమైన ఫలితాలు ఎదురవుతాయి. చివరికి చావు అంచులకు చేరుకుంటారు. ఓర్హాన్ తన ఫేత్‌ను రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మ్యాజిక్ రీబౌండ్ అవుతుంది. అది అతని కుటుంబాన్ని మరింత భయంకరమైన పరిస్థితిలోకి నెట్టివేస్తుంది. సినిమా ఒక మోరల్ లెసన్‌తో ముగుస్తుంది. సినిమా ఇంటెన్స్ విజువల్స్, భయంకరమైన సీన్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్‌తో ప్రేక్షకులను భయపెడుతుంది. ఇంతకీ చివరికి ఆ ఫ్యామిలీ ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

Related News

OTT Movie : చిన్నపిల్లను ఎత్తుకెళ్లే మిస్టీరియస్ జీవి… ఏలియన్, దెయ్యాలు, మంతగత్తెలు అన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 852 కోట్ల బ్లాక్ బస్టర్… నార్త్ ఆడియన్స్ కే ఎందుకు అందుబాటులో లేదంటే ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్…. ఓటీటీలో తుక్కురేగ్గొడుతున్న ధనుష్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’

OTT Movie : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

Big Stories

×