Betting Apps:బెట్టింగ్ యాప్స్.. ఈ పెనుభూతాన్ని పారద్రోలే ప్రయత్నం అధికారులు ఎంత చేసినా.. అక్కడక్కడ సెలబ్రిటీలు చేసే నిర్వాకం కారణంగా చాలామంది యువత ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను నమ్మి ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి తిరిగి పొందలేక నష్టపోయి, ఆ డబ్బును తీర్చలేక అప్పుల పాలవుతున్నారు. ఇంకొంతమంది భయంతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతోమంది సెలబ్రిటీలపై కేసు నమోదు అవ్వగా.. వారందరినీ విచారించిన ఈడి ఇకపై ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని పగడ్బందీగా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలా దాదాపు 29 మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారు.
ఇకపోతే టాలీవుడ్ వంతు అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ వంతు వచ్చింది. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చిక్కిన ఇద్దరు స్టార్ సెలబ్రిటీలకి ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ.. టిఎంసి మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి (Mimi Chakraborty), ఊర్వశీ రౌటేలా(Urvashi Rautela). అసలు విషయంలోకి వెళ్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పుడు దూకుడు మరింత పెంచింది. అందులో భాగంగానే తాజాగా మిమి చక్రవర్తిని ఈ నెల 15న, ఊర్వశిని ఈనెల 16న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ కూడా ప్రముఖ బెట్టింగ్ యాప్ 1xBet కు ప్రచారం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ యాప్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రచారంలో తదితర అంశాలలో వీరిద్దరి పాత్ర ఎంత ఉంది అని తెలుసుకోవడానికి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
విచారణకు హాజరైన మాజీ క్రికెటర్లు..
ఇదిలా ఉండగా.. ఇదే బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజా క్రికెటర్లకు ఈడి నోటీసులు పంపించి మరీ విచారణ జరిపింది. ఇక ఈ నెల 4న 8 గంటల పాటు శిఖర్ ధావన్ ను ఈ డి విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బాలీవుడ్ సెలబ్రిటీలపై ఫోకస్ పెట్టిన కేంద్రం అందులో భాగంగానే వీరిద్దరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరి విచారణలో వీరిద్దరూ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.
టాలీవుడ్ లో ఈడీ విచారణ ఎదుర్కొన్న సెలబ్రిటీస్ వీళ్లే..
దాదాపు 29 మందికి నోటీసులు అందివ్వగా.. అందరూ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ లాంటి సెలబ్రిటీలు కూడా విచారణకు హాజరవడం జరిగింది.. ఏది ఏమైనా ఈ బెట్టింగ్ భూతాన్ని పారద్రోలే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
ALSO READ:Tollywood Heroine: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!