OTT Movie : మలయాళం సినిమాలు ఫ్రెష్ కంటెంట్ తో ఎంతోమంది అభిమానుల మనసులను కొల్లగొడుతున్నాయి. అయితే డ్రామా జానర్‌లో ఎమోషనల్ డెప్త్, స్టేజ్ ప్లేలు, లేడీ ఓరియెంటెడ్ కథలతో నిండి ఉండే సినిమాలకు దక్కే ఆదరణ అంతా ఇంతా మాత్రమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రిప్పింగ్ మలయాళం డ్రామా మాత్రం 2021లో IFFKలో ప్రీమియర్ అయ్యి సత్తా చాటింది. మరి ఈ మూవీ పేరేంటి? కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఈ మలయాళం మూవీ పేరు Vasanthi (2021). షినోస్ & సాజస్ రహ్మాన్ భ్రాతృలు డైరెక్షన్, సిజు విల్సన్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ 2021 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో ప్రీమియర్ అయింది. థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా, మనోరమ మాక్స్‌లో 2024 ఆగస్టు చివరిలో డైరెక్ట్ OTT రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ మనోరమ మాక్స్ (Manorama Max)లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో స్వాసిక విజయ్ (వాసంతి), సిజు విల్సన్ (బాలు), షబరీష్ వర్మ, సివాజి గురువాయూర్, వినోద్ థామస్, మధు ఉమలయాలం, శ్రీలా నల్లేడం, మలవిక మల్ఘోష్ కీలక పాత్రలు పోషించారు. IMDbలో 6.6 రేటింగ్ ఉన్న ఈ సినిమా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ 2020లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.
సినిమా వాసంతి (స్వాసిక విజయ్) అనే యువతి జీవిత జర్నీ చుట్టూ తిరుగుతుంది. కథ మామూలు మహిళ జీవితం నుండి మొదలవుతుంది. వాసంతి తన తల్లి ఇంటిని వదిలి వెళ్లిన తర్వాత ఎదుర్కొన్న అనేక జ్ఞాపకాలను తెరపై చూడొచ్చు. ఒకవేళ ఇంట్లో నుంచి పారిపోతే అమ్మాయిలు ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇందులో స్పష్టంగా చూడొచ్చు. బాలు (సిజు విల్సన్) ఒక స్టేజ్ ప్లేలో వాసంతి స్టోరీని రికొర్డ్ చేయాలని కోరుకుంటాడు. వాసంతి ఆమె జీవిత కథను షేర్ చేస్తుంది.
ఇంట్లో నుంచి పారిపోయాక ఆమె జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. ఆమె ఖాతాలో హై-క్లాస్ క్లయింట్స్… జడ్జిలు, డాక్టర్లు, మ్యూజిషియన్లు ఉంటారు. ఈ క్రమంలోనే ఒకరోజు రాత్రి ఆమె ఇంట్లో ఒక జడ్జి చనిపోతాడు. అతని భార్య ఆమెను పబ్లిక్ షేమ్ అవాయిడ్ చేయడానికి ఈ సీక్రెట్‌ను సీక్రెట్ గానే ఉంచమని కోరుతుంది. వాసంతి కూడా అంగీకరిస్తుంది. ఇదంతా వాసంతి స్టేజ్ పైనే వెల్లడిస్తుంది.
వాసంతి చందు అనే థీఫ్ తో కలిసి జీవితం గడుపుతుంది. చందు పార్ట్నర్ సుకు (షబరీష్ వర్మ) వాసంతిని ఇల్ ఇంటెన్షన్ తో చూస్తాడు. తరువాత జరిగిన కార్ దొంగతనంలో చందు అరెస్ట్ అవుతాడు, వాసంతి మరియు సుకు ఎస్కేప్ అవుతారు. ఆ తరువాత సుకును నమ్మి అతనితోనే ఉంటుంది. కానీ సుకు… వాసంతిని ఒక రిచ్ మ్యాన్‌కు అమ్మేస్తాడు. అలా ఆమె జీవితంలో జరిగిన అన్ని విషయాలను వాసంతి స్టేజ్ ప్లేలో వెల్లడిస్తుంది. మరి చివరికి వాసంతి జీవితం ఎలా మారింది? ఏం జరిగింది? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఎమోషనల్ డెప్త్, స్టేజ్ ప్లే ఎలిమెంట్స్, స్వాసిక విజయ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
Read Also : పేరుకే 118 ఏళ్ల వృద్ధుడు… ముగ్గురమ్మాయిలతో లవ్ స్టోరీ… మైండ్ బెండయ్యే సై-ఫై మూవీ