E-Paper
Advertisement

OTT Movie : మర్డర్ ఒక్కటే ట్విస్టులు బోలెడన్ని… క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie :  మర్డర్ ఒక్కటే ట్విస్టులు బోలెడన్ని… క్రేజీ  సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. ఈ సినిమాలు గ్రిప్పింగ్ స్టోరీలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక అమ్మాయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ తో మొదలౌతుంది. ఆతరువాత స్టోరీ ట్విస్ట్ లతో ఉత్కంఠంగా సాగుతుంది. ఈ థ్రిల్లర్  మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

జీ 5 (ZEE5) లో

Advertisement

ఈ బాలీవుడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్  మూవీ పేరు ‘సైలెన్స్ కెన్ యు హియర్ ఇట్’ (Silence can you hear it). 2021 లో వచ్చిన ఈ మూవీకి అబన్ భరూచా డియోహన్స్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయి, ప్రాచీ దేశాయ్, అర్జున్ మాథుర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ పూజా చౌదరి అనే రిటైర్డ్ జడ్జి కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఇది జీ 5 (ZEE5) లో 2021 మార్చి 26 నుంచి అందుబాటులో ఉండి.

స్టోరీలోకి వెళితే

Advertisement

కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన కొంతమంది యువకులకు, ఒక అమ్మాయి మృతదేహం కనబడుతుంది. ఆమె తలపై ఎవరో గాయపరచి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఆమె ఒక రిటైర్డ్ జడ్జి కూతురు పూజగా పోలీసులు గుర్తిస్తారు. ఈ హై-ప్రొఫైల్ కేసును విచారించడానికి నార్కోటిక్స్ ఆఫీసర్ అయిన ఏసీపీ అవినాష్ వర్మ (మనోజ్ బాజ్‌పాయ్) నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటవుతుంది. అవినాష్ తన తెలివితేటలు, డిటెక్టివ్ నైపుణ్యాలతో, ఈ కేసులోని రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదించడానికి ప్రయత్నిస్తాడు.  విచారణలో పూజా చుట్టూ ఉన్న వ్యక్తులు, ఆమె కుటుంబం, స్నేహితుల రహస్యాలు బయటపడతాయి. అందరూ నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

అనేక ట్విస్ట్‌లు, టర్న్‌లతో హంతకుడు ఎవరనే ప్రశ్న చివరి వరకు ఉత్కంఠగా మారుతుంది. అవినాష్ ఏడు రోజుల్లో కేసును పరిష్కరించి, హంతకున్ని పట్టుకుంటాడు. చివరికి ఈ హత్య చేసింది ఎవరు ? అవినాష్ హంతకున్ని ఎలా పట్టుకుంటాడు ? పూజను ఎందుకు హత్య చేశారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీగా తెరకెక్కింది.  ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ నటన, సస్పెన్స్, ఊహించని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమా  జీ 5 ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.

Read Also : అమ్మాయిల పిచ్చితో దిక్కుమాలిన పని… ఈ మలయాళ సైకో థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ భయ్యా

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×