OTT Movie : మలయాళం సినిమాలంటే ఒకప్పుడు చిన్నచూపే ఉండేది. ఈ సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కాని ప్రస్తుత రోజుల్లో ఈ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో వీటిని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒమనక్కుట్టన్ అనే గతం మరచిపోన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత ఈ సినిమా స్టోరీ, కామెడీ సన్ని వేశాలతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ మలయాళ కామెడీ-థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
ఓమనక్కుట్టన్ ఎగ్జిక్యూటివ్ గా, హెయిర్ ఆయిల్ కంపెనీలో పనిచేస్తాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో, ఓమనక్కుట్టన్ నకిలీ ప్రొఫైల్స్ ద్వారా మహిళలతో ఫోన్‌లో చాట్ లను చేస్తుంటాడు. అతను ఒకసారి సిద్ధార్థ్ అనే సంగీతకారుడు నిర్వహించే సంగీత కచేరీ వేదికకు వస్తాడు. ఆ కచేరీలో, ఓమనక్కుట్టన్ పల్లవి అనే అమ్మాయిని చూస్తాడు. పల్లవి ఒక సైకాలజీ పరిశోధన విద్యార్థి, ఆమె దయ్యాల ఉనికి, వాటి గురించి పరిశోధన చేయడానికి ప్రయత్నిస్తోంది. కచేరీ ముగింపులో, పల్లవి సిద్ధార్థ్ కు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సిద్ధార్థ్, పల్లవిని తన నోట్-ప్యాడ్ ఇవ్వమని అడుగుతాడు, అతను ఆమెకు తన ఆటోగ్రాఫ్ ఇస్తాడు. పల్లవికి సిద్ధార్థ్ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడని అనుకుంటుంది. కానీ వాస్తవానికి నోట్-ప్యాడ్ పై సంతకం చేసి అతని నంబర్ ఇచ్చింది ఓమనకుట్టన్. వారు ఫోన్ కాల్ ద్వారా చాట్ చేయడం ప్రారంభిస్తారు. పల్లవికి తాను చాట్ చేసేది ఓమనకుట్టన్ అని తెలియదు. ఓమనకుట్టన్ పల్లవి, అనేక మంది ఇతర మహిళలతో వేర్వేరు వ్యక్తులుగా నటిస్తూ విజయవంతంగా చాట్ చేస్తూనే ఉంటాడు.
ఒక రోజు ఆఫీసు నుండి అర్థరాత్రి తిరిగి వస్తుండగా, ఒక టాక్సీ డ్రైవర్ అతనిని దోచుకుని తలపై కొట్టి డంప్ యార్డ్‌లో పడవేస్తాడు. అతను స్పృహలోకి వచ్చిన తరువాత, జ్ఞాపకశక్తిని కోల్పోయాడని తెలుసుకుంటాడు. తన జీవితంలో జరిగిన ప్రతిదాన్ని మరచిపోతాడు. తన పేరును కూడా మరచిపోతాడు. అతని వద్ద ఫోన్ ఉంది కానీ కొన్ని నంబర్లకు కాల్ చేసిన తర్వాత, ప్రజలు అతన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అతను మరింత గందరగోళానికి గురవుతాడు. హైవే మీద చిక్కుకుపోయిన అతను లిఫ్ట్ అడుగుతుంటాడు. ఇంతలో ఒక కారు ఆగుతుంది. లోపల పల్లవి ఉంటుంది. తాను ఇంతకాలం ఫోన్లో అతనితో మాట్లాడుతున్నానని కూడా ఆమెకు తెలియదు. చివరికి ఓమనకుట్టన్ కి గతం గుర్తుకు వస్తుందా ? పల్లవి అతనికి ఏవిధంగా సహాయం చేస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : కప్పు టీ ఇచ్చిన పాపానికి కొంప కొల్లేరు చేసింది … పక్కా ప్లాన్ తో బోల్తా కొట్టించే లేడీ కిలాడీ మావా
మనోరమమాక్స్ (ManoramaMax) లో
ఈ మలయాళ కామెడీ-థ్రిల్లర్ మూవీ పేరు ‘అడ్వెంచర్స్ ఆఫ్ ఒమనక్కుట్టన్’ (Adventures of Omanakuttan) . 2017లో విడుదలైన ఈ సినిమాకు రోహిత్ V. S. తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ ఒమనక్కుట్టన్ (అసిఫ్ అలీ) అనే అదృష్టం లేని వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని జీవితం ఒడిదుకులను ఎదుర్కుంటూ ఉంటుంది. ఇందులో ఆసిఫ్ అలీ, భావన, అజు వర్గీస్, సైజు కురుప్ వంటి నటులు నటించారు. దీనిని 4M ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆంటోని బినోయ్, బిజు పులికల్ నిర్మించారు. ఈ సినిమా 2017 మే 19న కేరళ అంతటా విడుదలైంది. ప్రస్తుతసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మనోరమమాక్స్ (ManoramaMax) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.