E-Paper
Advertisement

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా
Advertisement

OTT Movie : హారర్ సినిమాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో క్లైమాక్స్ వరకు ఈ సినిమాలు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హారర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం ఒక గ్రామాన్ని  నాశనం చేసిన ఒక భయంకరమైన శాపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హారర్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘సైలెంట్ హిల్’ (Silent hill) 2006లో విడుదలైన హారర్ చిత్రం. క్రిస్టోఫ్ గాన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ‘సైలెంట్ హిల్’ ఫిల్మ్ సిరీస్‌లో మొదటి భాగం. ఈ చిత్రంలో రాధా మిచెల్, సీన్ బీన్, లారీ హోల్డెన్, డెబోరా కారా ఉంగర్, కిమ్ కోట్స్, తాన్యా అలెన్, ఆలిస్ క్రిగే నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పీకాక్, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రోజ్ కూతురు షారన్‌ రాత్రిళ్లు నిద్రలో నడుస్తూ, “సైలెంట్ హిల్” అని మాట్లాడుతూ చూస్తూ ఉంటుంది. షారన్ ఆ పేరును గూగుల్ లో చూసి, వెస్ట్ వర్జీనియాలో ఆ ప్రాంతం ఉన్నట్లు తెలుసుకుంటుంది. అయితే ఆ గ్రామం 30సంవత్సరాల క్రితం మంటల్లో కాలిపోయి, పూర్తిగా ఖాళీ అయినట్టు ఉంటుంది. ఆ గ్రామంలో ఆమెకు సమాధానం దొరుకుతుందని భావించి, భర్త క్రిస్టోఫర్‌ కు ఏమీ చెప్పకుండా రోజ్ షారన్‌ను కారులో ఎక్కించుకుని బయలుదేరుతుంది. పట్టణం దగ్గరికి చేరుకునే సమయంలో ఒక వింత ఆకారం రోడ్డు మధ్యలో కనిపిస్తుంది. దీంతో రోజ్ కారు ప్రమాదానికి గురవుతుంది. ఆమె మెలకువ వచ్చినప్పుడు షారన్ కనిపించకుండా పోతుంది. రోజ్ పొగమంచుతో కప్పబడిన ఈ సైలెంట్ హిల్‌లో చిక్కుకుంటుంది. రోజ్ తన కూతుర్ని వెతుకుతూ ఆ గ్రామంలోకి ప్రవేశిస్తుంది.

Read Also : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Advertisement

ఈ గ్రామంలో ఒక మత విశ్వాస గుంపు ఉంటుంది. వాళ్ళు దుష్ట శక్తులు రాకుండా ఈ గ్రామాన్ని రక్షిస్తున్నామని చెబుతారు. వాళ్ళు రోజ్‌ను దుష్టు శక్తిగా భావించి ఆమెను బంధిస్తారు. ఈ లోపు క్రిస్టోఫర్ పోలీసుల సహాయంతో సైలెంట్ హిల్‌కు వస్తాడు. కానీ అతనికి ఆ గ్రామం ఖాళీగా కనిపిస్తుంది. రోజ్ ఉన్న రియాలిటీ అతనికి కనిపించదు. ఈ సమయంలో 30 సంవత్సరాల క్రితం, ఆ గ్రామాన్ని చుట్టు ముట్టిన ఒక భయంకరమైన శాపం వెనుక ఉన్న నిజాన్ని ఆమె తెలుసుకుంటుంది. ఇక క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ తో ముగుస్తుంది. చివరికి ఈ ప్రాంతం నుంచి రోజ్ బయట పడుతుందా ? రోజ్ కి షారన్‌ కనిపిస్తుందా ? ఆ పట్టణం సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×