OTT Movie : తమిళ ఇండస్ట్రీ బాక్సాఫీస్‌లో మోడరేట్ హిట్ గా నిలిచి, ఆడియెన్స్‌లో బాగా ట్రెండ్ అయిన మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చింది. అ*డల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకి అవార్డులు కూడా వస్తున్నాయి. చర్చ్ లో చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె నన్ గా ఉండలేక, తనలోని కోరికలను చంపుకోలేక సతమతమవుతుంది. మహిళల ఫ్రీడం కోసం ఈ సినిమా ఒక మెసేజ్ ఇస్తుంది. ఈ సినిమాకి Vikatan Cinema Awardsలో నటి సాయిశ్రీ ప్రభాకరన్ కి Best Debut Actress అవార్డ్ కూడా వరించింది. మరిన్ని అవార్డులను ఈ సినిమా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మారియా’ (Maria) అనేది 2025లో విడుదలైన తమిళ థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్ హరి కె. సుధాన్ రూపొందించిన ఈ చిత్రం 2025 అక్టోబర్ 3 నుంచి థియేటర్స్‌లో విడుదల అయింది. ఇందులో సాయిశ్రీ ప్రభాకరన్ (మారియా), పావెల్ నవగీతన్, సిధు కుమారసెన్, అబినయా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మారియాకి ఇప్పుడు 20 ఏళ్ల వయసు ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి కన్వెంట్‌లో నన్ గా పెరిగింది. ఆమెను ఫ్యామిలీ తనని పూర్తిగా చర్చ్ కి ఇచ్చేసింది. అక్కడ అందరూ మహిళలు మాత్రమే ఉంటారు. ప్రేయర్స్ చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. అందరూ మారియాను స్వచ్చమైన అమ్మాయి అని పొగుడుతారు. కానీ మారియా మనసులో రొమాన్స్ మీద ఆసక్తి మొదలవుతుంది. బయట ప్రపంచం, ప్రేమ, రొమాన్స్ గురించి ఆలోచిస్తుంది. రాత్రి ఒంటరిగా అలాంటి ఫీలింగ్స్ తో ఇబ్బంది పడుతుంటుంది. ఒక రోజు అక్కడికి కొత్త సిస్టర్ వస్తుంది. బయట ప్రపంచం ఫ్రీడమ్ గా, అందంగా ఉందని చెప్తుంది. దీంతో మారియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Read Also : నడిరోడ్డుపై ఒంటిపై నూలుపోగు లేకుండా పడుండే అమ్మాయి… చిన్న పిల్లలు చూడకూడని లీగల్ డ్రామా
బయటకు వచ్చాక మారియా ఒక గ్రూప్‌తో మీట్ అవుతుంది. అది ఒక సాతాన్ కల్ట్. క్రిస్టియానిటీ మనల్ని బానిసలుగా మారుస్తుందని, సాతానిజం అంటే ఫ్రీడమ్ అని అక్కడ ఉన్న ఒక హెడ్ చెబుతుంటాడు. మారియా ఆ మాటలకు అట్రాక్ట్ అవుతూ కల్ట్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ విచ్చలవిడితనం ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్, పార్టీలతో మారియా తనలో రగులుతున్న కోరికలను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. స్టోరీ నడిచే కొద్ది సాతానిజం అంటే ఫ్రీడమ్ కాదు, కంట్రోల్, మానిప్యులేషన్ అని ఆమె గుర్తిస్తుంది. క్రిస్టియానిటీ బానిసత్వం, సాతానిజం కూడా బానిసత్వమే అని ఆమె కల్ట్‌కు వ్యతిరేకంగా మారుతుంది. ఈ కథ మతం మహిళల్ని బానిసలా చేయకూడదు, తమ డిజైర్స్, ఫ్రీడమ్ కోసం పోరాడాలనే మెసేజ్ ని ఇస్తుంది.