Naveen Polishetty: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో నవీన్ పోలిశెట్టి ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేనొక్కడినే వంటి సినిమాల్లో కనిపించి తనకంటూ కొద్దిపాటి గుర్తింపు సాధించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత ముంబైకి వెళ్లిపోయాడు. అక్కడ యూట్యూబ్లో సిరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. తెలుగు దర్శకుడు స్వరూ ప్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాకి నవీన్ ను హీరోగా తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమాలో కనిపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నవీన్ క్రేజ్ అమాంతం మారిపోయింది. కేవలం హీరో గానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు నవీన్ పోలిశెట్టి కి ఉంది. ఇప్పుడు తాజాగా నవీన్ సింగర్ గా మారిపోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేయాలి అంటే నవీన్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక నవీన్ నటిస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో నవీన్ పాటను పాడబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. నవీన్ విషయానికి వస్తే పలు సందర్భాలలో ఆన్ స్టేజ్ పైన ఎక్కువసార్లు పాటలు పాడాడు. అవి కామెడీగా పాడినా కూడా ఎక్కడో ఒక చోట బానే పాడుతున్నాడు కదా అనిపించేది.
ఉదిత్ నారాయణ వాయిస్ అచ్చం అలానే దించేస్తాడు నవీన్ పోలిశెట్టి. పలు ఇంటర్వ్యూస్ లో కూడా ఇది చేసి చూపించాడు. అయితే ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పాడబోయే పాట మీద విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. దీని గురించి అధికారక ప్రకటన కూడా త్వరలో ఇవ్వనున్నారు.
2026 సంక్రాంతి సీజన్ సందర్భంగా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలా సిద్ధంగా ఉన్న సినిమాలలో అనగనగా రాజు సినిమా కూడా ఒకటి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సంక్రాంతి సీజన్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పెద్దపీట వేస్తారు. ఈ సినిమా కూడా అదే తరహాలో రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొంత వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుందో అనే క్యూరియాసిటీ ఇప్పటికే చాలామందికి మొదలైంది.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో భారీ మార్పులు, కథపై క్లారిటీ లేకుండానే గ్రీన్ సిగ్నల్?