E-Paper
Advertisement

ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో విద్యార్థులపై దాష్టీకమేంటి? కేంద్రాన్ని నిలదీసిన కవిత

ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో విద్యార్థులపై దాష్టీకమేంటి? కేంద్రాన్ని నిలదీసిన కవిత
Advertisement

Kavitha Slams BJP: బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బ్రిటీష్ జాహిల్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. దిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. పరీక్షలు ఫెయిర్ గా నిర్వహించాలని నిరసన తెలిపితే సీసీ కెమెరాలు ఆపేసి, ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థుల వీపులపై లాఠీలు ఝళిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా దాష్టీకాలకు పాల్పడిందో ఇప్పుడు బీజేపీ కూడా సొంత ప్రజలపై అదే విధంగా దాష్టీకాలు చేస్తోందని కవిత అన్నారు. విద్యార్థులపై పాశవికంగా చేసిన దాడికి బీజేపీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వలస పాలనలో బ్రిటీష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంత మూర్ఖంగా దాడులు చేశారో ఇప్పుడు బీజేపీ అంతే మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించటం పౌరులకు ఉన్న హక్కు అని గుర్తు చేశారు.

Advertisement

అటు నీట్ ఎగ్జామ్ నిర్వహించడం చేతకాని కేంద్రం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనలకు బాధ్యత ఎవరిది? విద్యార్థుల చావులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Advertisement

Also Read: Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

విద్యార్థులు చిందించిన ప్రతి రక్తం బొట్టుకు, వారిపై విరిగిన లాఠీలకు దేశం మొత్తం కచ్చితంగా ఓటు రూపంలో జవాబు చెబుతుందని కేంద్రాన్ని కవిత హెచ్చరించారు. పేపర్ లీక్ చేసిన వాళ్లను గుర్తించి వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ మాత్రం పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు చెప్పాలన్నారు. విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా సామరస్యంగా ఉండాలన్నారు.

Also Read: వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

Related News

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

Big Stories

Advertisement
×